WhatsApp: లక్షల ఖాతాలు బ్యాన్.. మీ అకౌంట్ పని చేస్తుందో లేదో చూసుకోండి..
ABN , Publish Date - Nov 03 , 2024 | 08:07 PM
ఏదైనా విషయాన్ని నేరుగా చెప్పలేని పరిస్థితుల్లో వాట్సప్ స్టేటస్ ద్వారా తమ కాంటక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్లకు తెలియజేసే వెసులుబాటు వాట్సప్‌లో ఉంటుంది. తాజాగా గత సెప్టెంబర్ నెలలో నిబంధనలు పాటించడంలేదని వాట్సప్ దాదాపు 85 లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. ఇవ్వన్నీ భారతీయులకు..
వాట్సప్ నేడు స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఒకరోజులో ఎక్కువసేపు వాట్సప్‌లో గడిపేవారి సంఖ్య పెరుగుతోంది. ఎంత బిజీ పనిలో ఉన్నా.. మధ్య, మధ్యలో వాట్సప్ చూడకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. సందేశాలు పంపుకోవడం మాత్రమే కాకుండా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకునే సౌకర్యం ఉండటంతో ప్రపంచంలో వాట్సప్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా స్టేటస్ ఆప్షన్ వాట్సప్‌లో అందరినీ ఆకట్టుకుంటుంది. ఏదైనా విషయాన్ని నేరుగా చెప్పలేని పరిస్థితుల్లో వాట్సప్ స్టేటస్ ద్వారా తమ కాంటక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్లకు తెలియజేసే వెసులుబాటు వాట్సప్‌లో ఉంటుంది. తాజాగా గత సెప్టెంబర్ నెలలో నిబంధనలు పాటించడంలేదని వాట్సప్ దాదాపు 85 లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. ఇవ్వన్నీ భారతీయులకు సంబంధించిన ఖాతాలేనని తెలుస్తోంది.
Kerala: రైల్వే ట్రాక్‌పై విషాదం.. నలుగురు మృతి
మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ అంటే తెలియని వారు ఉండరు. చిన్న పిల్లలు సైతం అందులో మెసేజులు చేయడం, ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం వంటి పనులు చేస్తుంటారు. అయితే, ఈ కాలంలో మంచి కోసం ఉపయోగించాల్సిన యాప్‌లను కొందరు వ్యక్తులు మిస్ యూజ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఎంత హెచ్చరించినా కొందరు మాత్రం తమ దారి తమదేనంటూ వ్యవహరిస్తున్నారు. ఇక యాప్ లను మిస్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకుండా ఆ సంస్థ సైతం కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ లో 85 లక్షల మంది భారతీయుల వాట్సప్ ఖాతాలపై నిషేదం విధించింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం వాట్సప్ ను దుర్వినియోగం చేసినందుకు, నిబంధనలను అతిక్రమించినందుకు ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఒక్క సెప్టెంబర్ లోనే ఏకంగా 85 లక్షల మంది ఖాతాలను బ్యాన్ చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. వీటిలో 16,58,000 ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా, ఐటీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
Hemant Soren: మేము గెలిస్తే నెలకు 7 కేజీల రేషన్, పింఛన్ పెంచుతాం
సోషల్ మీడియాలో ఎక్కువగా వాడుతున్న యాప్ వాట్సప్. దాదాపు 600 మిలియన్లకు పైగా యూజర్స్ ఉన్నారు. వాట్సప్ లో ఎక్కువగా మెసేజులు పెట్టడం, ఫొటోలు, వీడియోలు పంపించడం, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడటం, ఎదైనా సమాచారాన్ని సెకన్లలో పంపించడానికి ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ యాప్ ను తప్పుడు సమాచారం ఇచ్చేందుకు యూజ్ చేయడంతో యూజర్లపై కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆగస్ట్ లో 84.58 లక్షల ఖాతాలపై వేటు వేయగా సెప్టెంబర్ లో 85 లక్షల మంది ఖాతాలపై నిషేదం విధించింది.
Delhi Air Pollution: 500 మార్క్ దాటిన ఢిల్లీ వాయు కాలుష్యం.. స్థానికుల భయాందోళన
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here