Share News

విద్యా సంస్థలకు 8,557 కోట్లు ఖర్చు చేశాం

ABN , Publish Date - Dec 03 , 2024 | 03:39 AM

ఏపీలో మొత్తం 45,032 విద్యాసంస్థల్లో మౌలికసదుపాయాల కల్పనకు కేంద్రం రూ.7,480.21 కోట్లు కేటాయించగా, రాష్ట్రప్రభుత్వ నిధులతో కలిపి మొత్తం రూ.8,557.21 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరి తెలిపారు.

విద్యా సంస్థలకు 8,557 కోట్లు ఖర్చు చేశాం

న్యూఢిల్లీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఏపీలో మొత్తం 45,032 విద్యాసంస్థల్లో మౌలికసదుపాయాల కల్పనకు కేంద్రం రూ.7,480.21 కోట్లు కేటాయించగా, రాష్ట్రప్రభుత్వ నిధులతో కలిపి మొత్తం రూ.8,557.21 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరి తెలిపారు. ఏపీలో జిల్లాల వారీగా విద్యార్థుల సమగ్ర అభివృద్థి కోసం విద్యాసంస్థల మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్‌ చేయడానికి ముఖ్యంగా ఏలూరు జిల్లాలో కేంద్ర పథకాల ద్వారా కేటాయించిన, వినియోగించిన నిధుల వివరాలను ఎంపీ పుట్టా మహేష్‌ లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

Updated Date - Dec 03 , 2024 | 03:41 AM