Viral News: స్పోర్ట్స్ షూ వేసుకుని ఆఫీస్‌కు వచ్చిందని ఉద్యోగం తీసేశారు.. ఆ మహిళ కోర్టుకు ఎక్కితే..
ABN , Publish Date - Dec 29 , 2024 | 04:57 PM
ఆఫీస్‌కు వెళ్లేటపుడు కాస్త పద్ధతిగా తయారై వెళ్లాలి. ఫార్మల్ డ్రెస్ వేసుకుని ఆఫీస్ కోడ్‌ను బట్టి టక్ చేసుకుని షూ వేసుకుని వెళ్లాలి. అలా వెళ్లకపోతే బాస్‌ల నుంచి తిట్లు తినాల్సి ఉంటుంది. అంతకు మించి పెద్ద ప్రమాదం జరగదు. అయితే బ్రిటన్‌లోని ఓ సంస్థ మహిళా ఉద్యోగికి కోలుకోలేని షాకిచ్చింది.
ఆఫీస్ (Office)కు వెళ్లేటపుడు కాస్త పద్ధతిగా తయారై వెళ్లాలి. ఫార్మల్ డ్రెస్ వేసుకుని ఆఫీస్ కోడ్‌ను బట్టి టక్ చేసుకుని షూ వేసుకుని వెళ్లాలి. అలా వెళ్లకపోతే బాస్‌ల నుంచి తిట్లు తినాల్సి ఉంటుంది. అంతకు మించి పెద్ద ప్రమాదం జరగదు. అయితే బ్రిటన్ (Britain)లోని ఓ సంస్థ మహిళా ఉద్యోగికి కోలుకోలేని షాకిచ్చింది. స్పోర్ట్స్ షూ (Sports Shoe) వేసుకుని ఆఫీస్‌కు వచ్చిందనే నెపంతో ఏకంగా ఉద్యోగంలో నుంచి తీసేసింది. దీంతో ఆ మహిళ సదరు యాజమాన్యంపై కోర్టుకు ఎక్కింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral News).
బ్రిటన్‌కు చెందిన 20 ఏళ్ల ఎలిజబెత్ బెనాస్సీ ఓ సంస్థలో పని చేస్తోంది. ఆమె తన ఆఫీస్‌కు వెళ్లేటపుడు స్పోర్ట్స్ షూ వేసుకుని వెళ్లింది. దీంతో ఆమెను బాస్ ఉద్యోగంలో నుంచి తీసేశాడు. దీంతో ఆమె సదరు సంస్థ యాజమాన్యంపై కోర్టులో పిటిషన్ వేసింది. చాలా మంది ఉద్యోగులు ఆ తరహా షూలతోనే రోజూ ఆఫీస్‌కు వస్తారని, యాజమాన్యం తనను టార్గెట్ చేసిందని, అందుకే ఆ సాకు చూపి తనను ఉద్యోగంలో నుంచి తీసేసిందని పేర్కొంది. మొత్తం వాదనలు విన్న న్యాయమూర్తి ఎలిజబెత్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారు.
సౌత్ లండన్ ట్రిబ్యునల్ బెనాస్సీ పక్షం వహించి, ఉద్యోగికి అనుకూలంగా తీర్పునిచ్చింది. సదరు యాజమన్యం కావాలనే ఎలిజబెత్‌ను టార్గెట్ చేసినట్టు నిర్ధారణకు వచ్చింది. కంపెనీకి భారీ నష్టపరిహారం విధించింది. సదరు సంస్థ ఎలిజబెత్‌కు 30,000 పౌండ్లు (దాదాపు రూ. 32 లక్షలు) చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..