Share News

Aadhar : అప్‌డేట్‌ చేయకపోయినా ఆధార్‌ కార్డులు పనిచేస్తాయ్‌

ABN , Publish Date - May 28 , 2024 | 05:49 AM

ఆధార్‌ కార్డుల్లో సమాచారం అప్‌డేట్‌ చేసే విషయమై సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రసారమవుతున్నాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌) తెలిపింది. పదేళ్ల క్రితం జారీ చేసిన ఆధార్‌ కార్డుల్లోని వివరాలను

Aadhar : అప్‌డేట్‌ చేయకపోయినా ఆధార్‌ కార్డులు పనిచేస్తాయ్‌

ఉచితంగా అప్‌డేట్‌కు జూన్‌ 14 వరకు గడువు

న్యూఢిల్లీ, మే 27: ఆధార్‌ కార్డుల్లో సమాచారం అప్‌డేట్‌ చేసే విషయమై సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రసారమవుతున్నాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌) తెలిపింది. పదేళ్ల క్రితం జారీ చేసిన ఆధార్‌ కార్డుల్లోని వివరాలను జూన్‌ 14లోగా అప్‌డేట్‌ చేయకపోతే అవి చెల్లకుండా పోతాయంటూ ప్రచారం జరుగుతోందని, అది తప్పుదోవపట్టించేదని స్పష్టం చేసింది. ఆధార్‌ కార్డులోని వివరాలను ఆన్‌లైన్లో ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడానికి గతంలో మార్చి 14 వరకు గడువు ఇవ్వగా, దాన్ని తాజాగా జూన్‌ 14 వరకు పొడిగించినట్టు తెలిపింది. ఆ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో వక్రీకరించినట్టు పేర్కొంది. ఆన్‌లైన్‌లో కాకుండా ఆధార్‌ సేవా కేంద్రాలకు వెళ్తే నిర్ణీత రుసుము చెల్లించి ఫోన్‌ నెంబర్లు, ఫొటోల వంటి వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఒకవేళ ఈ వివరాలను అప్‌డేట్‌ చేసుకోనప్పటికీ కార్డులు చెల్లుబాటుకాకుండా పోవడం వంటిది జరగదని, అవి పనిచేస్తునే ఉంటాయని స్పష్టం చేసింది. అయితే వివరాలను అప్‌డేట్‌ చేసుకుంటే మంచిదని, ఇందుకు తమ ప్రోత్సాహం ఉంటుందని తెలిపింది.

Updated Date - May 28 , 2024 | 05:49 AM