Share News

Delhi: బంగారం స్మగ్లింగ్‌ చేసిన అఫ్గాన్‌ దౌత్య అధికారిణి రాజీనామా..

ABN , Publish Date - May 05 , 2024 | 04:36 AM

భారత్‌లో అఫ్గానిస్థాన్‌ తాత్కాలిక రాయబారిగా పనిచేస్తున్న జాకియా వర్దక్‌ (58) శనివారం తన పదవికి రాజీనామా చేశారు. గత నెల 25న ముంబై విమానాశ్రయంలో రూ.18.6కోట్ల విలువైన 25కిలోల బంగారాన్ని

Delhi: బంగారం స్మగ్లింగ్‌ చేసిన అఫ్గాన్‌ దౌత్య అధికారిణి రాజీనామా..

  • దుబాయి నుంచి వస్తూ దుస్తుల్లో 25 కిలోల గోల్డ్‌

  • ముంబైలో పట్టుకున్న డీఆర్‌ఐ అధికారులు

న్యూఢిల్లీ, మే4: భారత్‌లో అఫ్గానిస్థాన్‌ తాత్కాలిక రాయబారిగా పనిచేస్తున్న జాకియా వర్దక్‌ (58) శనివారం తన పదవికి రాజీనామా చేశారు. గత నెల 25న ముంబై విమానాశ్రయంలో రూ.18.6కోట్ల విలువైన 25కిలోల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేయడానికి ప్రయత్నించి పట్టుబడ్డ నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె దుబాయి నుంచి ఈ బంగారాన్ని తీసుకురాగా డీఆర్‌ఐవర్గాలు పట్టుకున్నా యి. ఆమెకు దౌత్యపరమైన రక్షణ ఉండడంతో అరెస్టు వంటి చర్యలు తీసుకోలేదు. ఆమె తొలుత ముంబైలోని కాన్సులేట్‌ కార్యాలయంలో చేరారు. తాలిబన్లకు ముందున్న అష్రాఫ్‌ ఘనీ పాలనలో ఆమె నియమితులయ్యారు.


గతేడాది నుం చి న్యూఢిల్లీలో తాత్కాలిక రాయబారిగా వ్యవహరిస్తున్నారు. బంగారం పట్టుబడ్డ సంగతిని ప్రస్తావించనప్పటికీ కొంతకాలంగా తనపై, కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం జరుగుతుండడంతో రాజీనామా చేసినట్టు తెలిపారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఏప్రిల్‌ 25న జకియా వర్దక్‌ తన కుమారునితో కలిసి దుబాయి నుంచి ఎమిరేట్స్‌ ఫ్లైట్‌లో దిగారు. గ్రీన్‌ చానెల్‌ ద్వారా బయటకు బయలుదేరారు. 5ట్రాలీ బ్యాగులు, ఒక హ్యాండ్‌బ్యాగు, దిండు, ఒక స్లింగ్‌ బ్యాగు వారిదగ్గరున్నాయి. అయితే రాయబార కార్యాలయానికి చెందిన వారని తెలిపే ట్యాగులేవీవాటికి లేకపోవడంతో తని ఖీ చేశారు. ఆమెను తనిఖీ చేయగా ఆమె ధరించిన ప్రత్యే క తరహా జాకెట్‌, లెగ్గిన్‌, బెల్టు, మోకాలికి పెట్టుకున్న క్యాప్‌ ల్లో ఒక్కోటి కేజీ బరువున్న 25బంగారు కడ్డీలు దొరికాయి.

Updated Date - May 05 , 2024 | 04:36 AM