Share News

Ajith category MLAs : అజిత్‌ వర్గం ఎమ్మెల్యేలు తిరిగి పవార్‌ గూటికి?

ABN , Publish Date - Jun 29 , 2024 | 06:02 AM

మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ మరో రాజకీయ కుదుపు సంభవించే సంకేతాలు కనిపిస్తున్నాయి. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన చాలా మంది

Ajith category MLAs : అజిత్‌ వర్గం ఎమ్మెల్యేలు తిరిగి పవార్‌ గూటికి?

సంప్రదింపులు జరుపుతున్న 22 మంది ఎమ్మెల్యేలు

వారిలో 12 మందిని చేర్చుకునే అవకాశం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం

ముంబై, జూన్‌ 28: మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ మరో రాజకీయ కుదుపు సంభవించే సంకేతాలు కనిపిస్తున్నాయి. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు శరద్‌ పవార్‌ శిబిరంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఇప్పటికే వారు ఎన్సీపీ (ఎస్పీ) తలుపులు తట్టారని తెలుస్తోంది. అయితే వారిలో ఎంత మందిని చేర్చుకోవాలన్న దానిపై శరద్‌ పవార్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. 22 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎన్సీపీ (ఎస్పీ)ని సంప్రదించారని ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ చెప్పారు. వీరంతా శరద్‌ పవార్‌ శిబిరంలో చేరాలనుకుంటున్నారని, అయితే వారి విషయంలో ఇప్పటి వ రకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. కాగా శరద్‌ పవార్‌ వారందరినీ పార్టీలో చేర్చుకునే అవకాశంలేదని, 10 నుంచి 12 మందికి మాత్రమే ఆహ్వానం పలకవచ్చని తెలుస్తోంది. అజిత్‌ పవార్‌ రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించాలని బీజేపీ భావిస్తున్నట్టు ఉందని రోహిత్‌ తెలిపారు. ప్రతిపక్షం ఓట్లను చీల్చే వ్యూహంలో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీని వేరేగా పోటీ చేయించాలని బీజేపీ అనుకుంటూ ఉండవచ్చన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉన్నాయి. అయితే ఇందులో 20 సీట్లు మాత్రమే అజిత్‌ పవార్‌కు బీజేపీ ఇవ్వవచ్చని ఆయన చెప్పారు. మరోవైపు అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఎన్సీపీ ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ను కలిశారు. సమీప భవిష్యత్తులోనే వారు శరద్‌ పవార్‌ శిబిరంలో చేరే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఎన్సీపీ (ఎస్పీ) నేత ఒకరు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ (ఎస్పీ) సాఽధించిన విజయం నేపథ్యంలో ఈ పార్టీ వైపు ఎన్సీపీ ఎమ్మెల్యేలు దృష్టిసారించారు. .

Updated Date - Jun 29 , 2024 | 06:02 AM