Share News

బీజేపీ ఎంపీ అభినందన సభలో మద్యం

ABN , Publish Date - Jul 09 , 2024 | 05:01 AM

కర్ణాటకలో బీజేపీ ఎంపీ అభినందన సభలో పోలీసు బందోబస్తు నడుమ మద్యం పంపిణీ చేసిన వైనం పెనుదుమారం రేపింది. చిక్కబళ్లాపుర ఎంపీ .సుధాకర్‌కు నెలమంగల తాలూకా బావికెరె గ్రామ పరిధిలో

బీజేపీ ఎంపీ అభినందన సభలో మద్యం

బెంగళూరు, జూలై 8(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో బీజేపీ ఎంపీ అభినందన సభలో పోలీసు బందోబస్తు నడుమ మద్యం పంపిణీ చేసిన వైనం పెనుదుమారం రేపింది. చిక్కబళ్లాపుర ఎంపీ .సుధాకర్‌కు నెలమంగల తాలూకా బావికెరె గ్రామ పరిధిలో ఆదివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. బీజేపీ-జేడీఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యకర్తలు, ప్రజల కోసం 650 కేసుల బీర్లు, 450 కేసుల మద్యం బాటిళ్లు సిద్ధం చేశారు. సభా ప్రాంగణంలోనే మద్యం పంపిణీ కౌంటర్‌ ఉండడంతో పెద్ద ఎత్తున తోపులాట జరుగుతుందని పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పందిస్తూ.. కార్యకర్తలకు మద్యం పంపిణీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 09 , 2024 | 06:52 AM