రాహుల్ క్షమాపణ చెప్పాలి: షా
ABN , Publish Date - Jul 02 , 2024 | 05:25 AM
లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై అమిత్‌షా ఎదురుదాడికి దిగారు. కోట్ల మంది తాము హిందువులమని గర్వంగా భావిస్తుంటే రాహుల్‌గాంధీ వాళ్లనందర్నీ హింసావాదులని అంటున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీ విధించిన, 1984లో ఢిల్లీలో
లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై అమిత్‌షా ఎదురుదాడికి దిగారు. కోట్ల మంది తాము హిందువులమని గర్వంగా భావిస్తుంటే రాహుల్‌గాంధీ వాళ్లనందర్నీ హింసావాదులని అంటున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీ విధించిన, 1984లో ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోసిన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రాహుల్‌కు అహింస గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. మరోవైపు, ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వారు హిందూత్వను హింసతో ముడి పెట్టడం దురదృష్టకరమని ఆరెస్సెస్ ప్రచార విభాగం అధిపతి సునీల్ అంబేద్కర్ అన్నారు. వివేకానందుడి హిందూత్వ అయినా, గాంధీ హిందూత్వ అయినా సుహృద్భావాన్ని, సోదరభావాన్ని సూచిస్తాయని చెప్పారు.