Share News

Video Viral: బిహార్‌లో కూలిన మరో వంతెన.. వారంలో రెండో ఘటన

ABN , Publish Date - Jun 22 , 2024 | 04:12 PM

బిహార్‌లో మరో వంతెన కుప్పకూలింది. సివాన్ జిల్లాలో చిన్న వంతెన కూలిపోయింది. అందుకు సంబంధించిన వీడియో.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 45 ఏళ్ల క్రితం గండక్ కెనాల్‌పై నిర్మించిన వంతెన శనివారం కూలిపోయింది.

Video Viral: బిహార్‌లో కూలిన మరో వంతెన.. వారంలో రెండో ఘటన

పాట్నా, జూన్ 22: బిహార్‌లో మరో వంతెన కుప్పకూలింది. సివాన్ జిల్లాలో చిన్న వంతెన కూలిపోయింది. అందుకు సంబంధించిన వీడియో.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 45 ఏళ్ల క్రితం గండక్ కెనాల్‌పై నిర్మించిన వంతెన శనివారం కూలిపోయింది.

అయితే వంతెన కూలిన శబ్దాలు.. పొరుగునే ఉన్న ధర్బంగా జిల్లాలోని రామ్‌ఘర్ వరకు వినిపించాయని స్థానికులు వెల్లడించారు. మహరాజ్‌గంజ్‌లోని పతేది బజార్‌ను ధర్బంగా జిల్లాలోని రామ్‌ఘర్ పంచాయితీలను ఈ వంతెన కలుపుతుందని వారు తెలిపారు. ఈ వంతెనపై నిత్యం వేలాది మంది ప్రజలు ప్రయాణిస్తారని పేర్కొన్నారు.


అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం. మరోవైపు జూన్ 18వ తేదీన అరారియా జిల్లాలో కుర్సాకాంతా, సిక్తి మధ్య బాక్రా నదిపై నిర్మిస్తున్న వంతెన కుప్ప కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ వంతెన నిర్మాణానికి వినియోగించిన దాదాపు రూ.12 కోట్లు నేలపాలైయ్యాయి.

అయితే మరికొద్ది రోజుల్లో ఈ వంతెన ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ వంతెన కూలిపోయిన ఘటనలో పోలీసులు పలువురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

అలాగే ఈ ఏడాది మొదట్లో ఇదే రాష్ట్రంలోని సుపౌల్‌లో కోసి నదిపై రూ. 984 కోట్లతో నిర్మిస్తున్న వంతెన స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించిన సంగతి తెలిసిందే.

Read Latest Telangana News and National News

Updated Date - Jun 22 , 2024 | 04:12 PM