Madhyapradesh: ప్రాణం తీసిన సరదా స్టంట్.. ఏప్రిల్ ఫూల్ చేయబోయి..
ABN , Publish Date - Apr 02 , 2024 | 08:57 PM
కొందరు సరదా కోసం చేసే స్టంట్స్ అప్పుడప్పుడు వారి ప్రాణాల మీదకే తెస్తాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన ఇలాగే విద్యార్థి ప్రాణాలు తీసింది. ఏప్రిల్ ఫూల్స్ నెల కావడం ఈ ఘటనకు కారణమైంది.
ఇండోర్: కొందరు సరదా కోసం చేసే స్టంట్స్ అప్పుడప్పుడు వారి ప్రాణాల మీదకే తెస్తాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన ఇలాగే విద్యార్థి ప్రాణాలు తీసింది. ఏప్రిల్ ఫూల్స్ నెల కావడం ఈ ఘటనకు కారణమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ కి చెందిన 18 ఏళ్ల రఘువంశీ.. ఏప్రిల్ ఫూల్స్ డే కావడంతో సోమవారం తన స్నేహితులను ఫూల్స్ చేద్దామని, రియలిస్టిక్ గా నమ్మిద్దామని అనుకున్నాడు.
ఈ క్రమంలో స్నేహితులకు వీడియో కాల్ చేశాడు. తాను నివసిస్తున్న రూంలో ఫ్యాన్ కి తాడు వేలాడదీసి.. ఉరి వేసుకోబోతున్నట్లు స్నేహితులతో చెప్పాడు. వారు దాన్ని నమ్మకపోవడంతో తాడును కాస్తా మెడలో వేసుకున్నాడు. ప్రమాదవశాత్తు అతని కింద ఉన్న స్టూల్ పక్కకు జరగడంతో.. ఉరిపడిపోయింది.
అలా వీడియో కాల్ లో స్నేహితుల కళ్ల ముందే విద్యార్థి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సరదా కోసం చేసిన ఓ స్టంట్ ప్రాణాలు తీయడంతో స్నేహితుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ దండోటియా మాట్లాడుతూ.. మృతుడు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ డ్రైవర్ కుమారుడిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రఘువంశీ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అంతకుముందు, ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరిన 36 ఏళ్ల సంజు భవనం నాలుగో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కళాశాల అధికారి ఒకరు తెలిపారు. మద్యానికి బానిసై భవనంపై నుంచి దూకడంతో తలకు గాయం అయిందని చెప్పారు. అతను మార్చి 19న ఆసుపత్రిలో చేరినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రజాపతి వెల్లడించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి