BJP MP Kangana Ranaut : రేప్‌లు, హత్యలు చేసినా మీకు ఫర్వాలేదా?
ABN , Publish Date - Jun 09 , 2024 | 05:43 AM
చండీగఢ్ విమానాశ్రయంలో తనపై జరిగిన దాడి ఘటనను సమర్థించిన వారిపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విరుచుకుపడ్డారు.
తనను కొట్టిన కానిస్టేబుల్‌ను సమర్థించిన వారిపై కంగన
న్యూఢిల్లీ, జూన్ 8: చండీగఢ్ విమానాశ్రయంలో తనపై జరిగిన దాడి ఘటనను సమర్థించిన వారిపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విరుచుకుపడ్డారు. తనను చెంప దెబ్బ కొట్టిన సీఐఎ్‌సఎఫ్ మహిళా కానిస్టేబుల్‌ను సమర్థించిన వారిని ఉద్దేశిస్తూ.. ‘అత్యాచారాలు, హత్యలు జరిగినా మీకు ఫర్వాలేదా?’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. శనివారం ‘ఎక్స్’లో ఆమె ఈ మేరకు పోస్టు చేశారు. ‘ప్రతి రేపిస్టు, హంతకుడు లేదా దొంగ నేరం చేయడానికి బలమైన భావోద్వేగ, శారీరక, మానసిక లేదా ఆర్థిక పరమైన కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏ నేరం జరగదు. చట్టాలను ఉల్లంఘించి నేరాలకు పాల్పడే నేరస్తుల భావోద్వేగాలకు మీరు విలువ ఇవ్వడం అత్యాచారాలు, హత్యలను సమ్మతించడం కిందకే వస్తుంది’’ అని కంగన తన విమర్శలకు సూచించారు.