Home » Kangana Ranaut
సమసమాజ స్థాపన కోసం 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలను మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తీసుకుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సాగు చట్టాల రద్దు కోరుతూ 700 మంది రైతులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు బలిదానాలు చేసినా బీజేపీ నేతలు సంతృప్తి చెందినట్టుగా లేరని రాహుల్ గాంధీ విమర్శించారు. అన్నదాతలకు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు చేసినా 'ఇండియా' కూటమి అడ్డుకుంటుందన్నారు.
సాగు చట్టాలపై తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, పార్టీ వైఖరితో వీటికి ఎలాంటి సంబంధం లేదని కంగన రనౌత్ వివరించారు. సాగుచట్టాలను వెనక్కి తేవాలంటూ ఇటీవల కంగన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది.
కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రుణాలు తీసుకుని ఆ సొమ్మును సోనియాగాంధీకి సమర్పిస్తోందంటూ కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది.
దేశ రాజధాని న్యూఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతుంది. అలాంటి వేళ.. కంగనా రనౌత్‌పై పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీ దళ్ మాజీ ఎంపీ సిమ్రాన్‌జిత్ సింగ్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హరియాణా అసెంబ్లీకి ఆక్టోబర్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు.. బీజేపీయేతర పక్షాలకు ఆయుధంగా మలచుకున్నాయి. అందులోభాగంగా రైతుల పట్ల బీజేపీ మైండ్ సెట్ ఎలా ఉందనేందుకు కంగనా రనౌత్ వ్యాఖ్యలే నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది.
రైతుల నిరసనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్ఠానం తప్పు పట్టింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ ఆమెను మందలించింది.
సెబీ ఛైర్పర్సన్ మధాబి పూరీ బుచ్ ఆమె భర్త ధవల్ బుచ్‌లపై ఇటివల హిండెన్‌బర్గ్(hindenburg) నివేదిక తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై రిపోర్టుకు మద్దతుగా ఎన్డీఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(kangana ranaut) రాహుల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాదితో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.