Beef Ban: గొడ్డు మాసంపై నిషేధం.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Dec 04 , 2024 | 09:43 PM
దేవాలయాల దగ్గర గొడ్డుమాంసం తినడాన్ని నిలిపివేయాలని తమ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు ఆ నిషేధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు, బహిరంగ ప్రదేశాలకు విస్తరించాలని నిర్ణయించామని హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
డిస్పూర్: ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) సారథ్యంలోని అసోం (Assam) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రెస్టారెంట్లు, హోటలు, బహిరంగ ప్రాంతాల్లో గొడ్డు మాంసం (Beef) విక్రయాలు, వినియోగంపై నిషేధం విధిస్తు్న్నట్టు ప్రకటించింది. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
Ajit Pawar Vs Shinde: షిండేపై జోక్ కట్ చేసిన అజిత్.. కౌంటర్ జోక్ పేల్చిన షిండే
''రెస్టారెంట్లు, హోటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం వడ్డించడం, వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాం'' అని బుధవారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో హిమంత్ బిశ్వ శర్మ తెలిపారు. దేవాలయాల దగ్గర గొడ్డుమాంసం తినడాన్ని నిలిపివేయాలని తమ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు ఆ నిషేధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు, బహిరంగ ప్రదేశాలకు విస్తరించాలని నిర్ణయించామని చెప్పారు. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని చెప్పారు.
క్యాబినెట్ విస్తరణ
కాగా, క్యాబినెట్ విస్తరణను డిసెంబర్ 7న చేపట్టనున్నట్టు కూడా హిమంత్ బిశ్వ శర్మ ప్రకటించారు. కొత్తగా కొందరు మినిస్టర్లను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు చెప్పారు. గౌహతి నుంచి సిల్చార్‌కు మోఘాలయ గుండా రూ.25,000 కోట్లతో ఎక్స్‌ప్రెస్ వే నిర్మింంచే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందని తెలిపారు.
ఇవి కూడా చదవండి
Sukhbir Singh Badal: సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపిందెవరంటే
Uttarakhand: ఆ గంగాజలం స్నానానికి తప్ప తాగడానికి పనికిరాదు: పీసీబీ
Rahul Gandhi: ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.