Share News

Independence Day: కేజ్రీవాల్‌కు బదులుగా త్రివర్ణపతాకం ఎగురవేయనున్న అతిషి

ABN , Publish Date - Aug 12 , 2024 | 05:52 PM

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని విద్యాశాఖ మంత్రి అతిషి ఎగురవేస్తారు. అతిషిని జాతీయపతాకం ఎగురవేయాల్సిందిగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరినట్టు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ సోమవారంనాడు తెలిపారు.

Independence Day: కేజ్రీవాల్‌కు బదులుగా త్రివర్ణపతాకం ఎగురవేయనున్న అతిషి

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day)సందర్భంగా ఆగస్టు 15న ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని విద్యాశాఖ మంత్రి అతిషి (Atishi) ఎగురవేస్తారు. అతిషిని జాతీయపతాకం ఎగురవేయాల్సిందిగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరినట్టు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ సోమవారంనాడు తెలిపారు. ఈమేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD)కి ఆయన లేఖ కూడా రాశారు.


''ముఖ్యమంత్రిని ఈరోజు కలుసుకున్నారు. ఛత్రసాల్ స్టేడియంలో ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో అతిషి చేత జెండా ఎగురవేయించాలని సీఎం చెప్పారు. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది'' అని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు రాసిన లేఖలో రాయ్ పేర్కొన్నారు.

Arvind Kejriwal: జెండా ఎగురవేయడంపై ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ.. జైలు అధికారులు అభ్యంతరం


ఏటా ఢిల్లీ ప్రభుత్వం ఛత్రసాల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహిస్తుంటుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రసగిస్తుంటారు. కాగా, ఈ ఏడాది అతిషిని త్రివర్ణ పతాకం ఎగురవేస్తారంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాసినట్టు ఈనెల 7న 'ఆప్' ప్రకటించింది. కాగా, జెండా ఆవిష్కరణకు సంబంధించి ఇంతవరకూ తమకు ఆప్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని ఎల్జీ కార్యాలయం తెలిపింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 12 , 2024 | 05:54 PM