Ayodhya Ram Mandir: బాల రాముడిని చూశారా.. ఎంత అందంగా ఉన్నాడో..
ABN , Publish Date - Jan 19 , 2024 | 04:32 PM
Lord Ram in Ayodhya Ram Mandir: భారత ప్రజలే కాకుండా.. యావత్ ప్రపంచంలోని హిందూ సమాజం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. మరో నాలుగు రోజుల్లో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది. ఇందులో భాగంగా రామాలయం గర్భగుడిలో బాల రాముడి ప్రతిమను ప్రతిష్ఠించారు ఆలయ నిర్వాహకులు.
First Pic of Lord Ram in Ayodhya Ram Mandir: భారత ప్రజలే కాకుండా.. యావత్ ప్రపంచంలోని హిందూ సమాజం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. మరో నాలుగు రోజుల్లో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. అయితే, ప్రాణ ప్రతిష్ఠకు ముందే.. రామాలయం గర్భగుడిలో బాల రాముడి ప్రతిమను ప్రతిష్ఠించారు ఆలయ నిర్వాహకులు. ఆ సుందర బాలరాముడిని చూసేందుకు రెండు కనులు చాలవంటే అతిశయోక్తికాదు. బాలరాముడి తొలి చిత్రాన్ని విడుదల చేశారు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మనోహరంగా శ్రీరాముడి విగ్రహం..
ప్రస్తుతం విడుదలైన బాల రాముడి విగ్రహాన్ని కృష్ణ శిలతో శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. 5 అడుగుల పొడవైన బాల రాముడి విగ్రహం బరువు 150 కేజీలు ఉంది. నల్లని పద్మపీఠంపై ఐదేళ్ల బాలుడి రూపంలో కొలువుదీరారు రామయ్య. ముఖంపై చిరుదరహాసంతో.. నుదిటన మూడు నామాలతో సుందర రూపంలో వెలిగిపోతున్నారు. బంగారు విల్లు, బాణం చేత పట్టుకుని నిల్చుని ఉన్నారు శ్రీరాముడు.
అభిజిత్ ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం..
అభిజిత్ ముహూర్తంలో పుష్యశుక్ల ద్వాదశి రోజున ప్రాణప్రతిష్టాపన చేయనున్నారు. శ్రీరామ నవమి రోజున గర్భగుడిలో సూర్యకిరణాలు పడేలా అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించారు. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.20 - 1.00 గంటల మధ్య ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. కాశీకి చెందిన జ్ఞానేశ్వర్ శాస్త్రి ఆధ్వర్యంలో రామాలయ ప్రతిష్టాపన పూజలు జరగనున్నాయి.