Ayodhya: రామమందిరానికి అపురూపమైన కానుక సమర్పించిన భక్తులు
ABN , Publish Date - Jan 29 , 2024 | 08:08 AM
అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఆలయానికి కానుకలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ఓ భక్త బృందం వెండి చీపురు(Silver Broom)ను కానుకగా ఇచ్చింది.
అయోధ్య: అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఆలయానికి కానుకలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ఓ భక్త బృందం వెండి చీపురు(Silver Broom)ను కానుకగా ఇచ్చింది. గర్భగుడిని శుభ్రపరిచేందుకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అఖిల్ భారతీయ మాంగ్ సమాజ్'కు చెందిన రామభక్తులు 1.8 కిలోల వెండి చీపురును కానుకగా అందజేశారు.
క్యూ కడుతున్న భక్తులు
అయోధ్య రామాలయానికి భక్తులు క్యూ కడుతున్నారు. రాములవారికి ఉదయం 4:30 గంటలకు శృంగార హారతి, ఉదయం 6:30 గంటలకు మంగళ ప్రార్ధన నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి దర్శనానికి అనుమతి ఉంటుంది. భక్తులు ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి బారులు తీరుతున్నారు. ఆలయ ప్రాంగణంలో రద్దీ నిత్యం ఉంటోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా రామ జన్మ భూమి ట్రస్ట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.