Bangladesh Turmoil: కేంద్రానికి పశ్చిమ బెంగాల్ గవర్నర్ మద్దతు
ABN , Publish Date - Aug 06 , 2024 | 09:57 AM
భారతదేశ భూభాగంలోకి అనధికారిక ప్రవేశాన్ని తొలగించేందుకు కేంద్రం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తప్పుడు సమాచారం ఇచ్చేవారిపైనే కాకుండా పుకార్లను ప్రచారం చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని గవర్నర్ సి వి ఆనంద్ బోస్ హెచ్చరించారు.
కోల్‌కతా, ఆగస్ట్ 06: పొరుగునున్న బంగ్లాదేశ్‌లో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నా.. ఇరు దేశాల మధ్య సరిహద్దు మాత్రం సురక్షితంగా ఉందని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ స్పష్టం చేశారు. అలాగే ఇరు దేశాల సరిహద్దు రక్షణకు భారత్ ప్రభుత్వం తీసుకునే అన్నిచర్యలకు పశ్చిమ బెంగాల్ మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి పుకార్లు నమ్మ వద్దని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన విజ్జప్తి చేశారు. పుకార్లు ప్రచారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక పుకార్లకు ఆస్కారమున్న నేపథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నిఘా కమిటీ ఎల్లవేళలా పని చేస్తుందని చెప్పారు.
Also Read: Uttar Pradesh: 80 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
సరిహద్దు హై అలర్ట్...
భారతదేశ భూభాగంలోకి అనధికారిక ప్రవేశాన్ని తొలగించేందుకు కేంద్రం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తప్పుడు సమాచారం ఇచ్చేవారిపైనే కాకుండా పుకార్లను ప్రచారం చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని గవర్నర్ సి వి ఆనంద్ బోస్ హెచ్చరించారు. ఈ మేరకు రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. మరోవైపు భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్‌ను సోమవారం సరిహద్దు భద్రత దళం(బీఎస్ఎఫ్) జారీ చేసిన సంగతి తెలిసిందే. భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య 4,096 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.
Also Read: Gold Rates Today: తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి ధర.. ఎంతంటే?
రిజర్వేషన్ల సంస్కరణ కోసం ఆందోళనలు
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనకు ఇటీవల పిలుపు నిచ్చారు. ఆ క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ హింసతో బాధితులుగా మారిన వారికి ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ ప్రకటనపై బీజేపీ కీలక నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమన్నారు.
స్పందించని సీఎం మమతా బెనర్జీ..
దేశంలో త్వరలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ క్రమంలో ఓ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం సీఎం మమతా ఈ విధమైన ప్రకటన చేశారని బీజేపీ సీనియర్ నేత మండిపడ్డారు. ఇక బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది.
దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసి.. పొరుగునున్న భారత్‌కు తరలి వెళ్లారు. అటు నుంచి ఆమె లండన్ వెళ్తారని సమాచారం. తాజాగా బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనలపై మాత్రం సీఎం మమతా బెనర్జీ ఇప్పటి వరకు స్పందించక పోవడం గమనార్హం. అలాంటి వేళ.. బంగ్లాదేశ్‌లో తాజా పరిణామాలపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Read More National News and Latest Telugu News