Share News

Rajnath Singh: రక్షణరంగ ఉత్పత్తుల్లో మరో మైలురాయి.. 16 శాతం వృద్ధి

ABN , Publish Date - Jul 05 , 2024 | 03:18 PM

దేశ రక్షణ రంగ ఉత్పత్తుల్లో కేంద్రం మరో మైలురాయిని చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2023-24లో 16.7 శాతం వృద్ధి రేటు సాధించింది. రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయిలో రూ.1,26,887 కోట్లకు చేరినట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారంనాడు తెలిపారు.

Rajnath Singh: రక్షణరంగ ఉత్పత్తుల్లో మరో మైలురాయి.. 16 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగ (Defence sector) ఉత్పత్తుల్లో కేంద్రం మరో మైలురాయిని చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2023-24లో 16.7 శాతం వృద్ధి రేటు సాధించింది. రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయిలో రూ.1,26,887 కోట్లకు చేరినట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh)శుక్రవారంనాడు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌‌ను లీడ్ చేసే విధంగా అభివృద్ధి భారత్‌ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.


నరేంద్ర మోదీ సారథ్యంలో 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వాటిని విజయవంతంగా అమలు చేయడం ద్వారా స్వదేశీ రక్షణ ఉత్పత్తుల వృద్ధి మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయికి చేరినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (డీపీఎస్‌యూ), ఇతర పీఎస్‌యూ మాన్యుఫాక్చరింగ్ డిఫెన్స్ ఐటెమ్స్, ప్రైవేటు కంపనీల నుంచి అందిన సమాచారం ప్రకారం రికార్డు స్థాయిలో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1,26,888 కోట్లకు చేరినట్టు తెలిపింది. తద్వారా గత ఏడాది కంటే 16.7 శాతం వృద్ధి సాధించామని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రూ.1,08,684 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది.

Chennai: తమిళనాడులో తెలుగును బతికించండి.. చంద్రబాబుకు కేతిరెడ్డి వినతి


'మేక్ ఇన్ ఇండియా' కొత్త పుంతలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏటేటా రక్షణ రంగ ఉత్పత్తుల్లో సాధిస్తున్న వృద్ధితో 'మేక్ ఇన్ ఇండియా' ప్రోగ్రాం సరికొత్త మైలురాళ్లను చేరుకుంటోందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో లీడింగ్ హబ్‌గా ఇండియాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 2023-24లో రక్షణ రంగ ఉత్పత్తుల మొత్తం విలువలో డీపీఎస్‌యూలు/పీఎస్‌యూల కాంట్రిబ్యూషన్ 79.2 శాతంగానూ, ప్రైవేటు రంగం కాంట్రిబ్యూషన్ 20.8 శాతంగానూ ఉందని తెలిపారు. విధానపరమైన సంస్కరణలు, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా గత పదేళ్లలో రక్షణరంగ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధికి ప్రభుత్వం చేసిన కృషికి ఇది నిదర్శనమని చెప్పారు.

For Latest News and National News click here

Updated Date - Jul 05 , 2024 | 03:18 PM