Bihar crisis: రాజ్‌భవన్‌కు చేరుకున్న నితీష్... సంచలన ప్రకటన చేసే అవకాశం
ABN , Publish Date - Jan 26 , 2024 | 04:21 PM
బీహార్ రాజకీయాల్లో తలెత్తిన అనిశ్చితి ఒక్కసారిగా పతాక స్థాయికి చేరుకుంది. మహాఘట్బంధన్‌కు సీఎం నితీష్ కుమార్ గుడ్‍బై చెప్పనున్నారని, బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రభుత్వాన్ని కొనసాగించే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ నితీష్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం పాట్నాలోని రాజ్‌భవన్ చేరుకున్నారు.
పాట్నా: బీహార్ రాజకీయాల్లో తలెత్తిన అనిశ్చితి ఒక్కసారిగా పతాక స్థాయికి చేరుకుంది. అధికార మహాఘట్బంధన్‌కు సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) గుడ్‍బై చెప్పనున్నారని, బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రభుత్వాన్ని కొనసాగించే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ నితీష్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం పాట్నాలోని రాజ్‌భవన్ చేరుకున్నారు. 'ఎట్ హోం' రెసెప్షన్‌లో ఆయన పాల్గొన్నారు. దీంతో నితీష్ ఏదో ఒక కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. నితీష్ రాజీనామా ప్రకటన చేస్తారనే ప్రచారం మాత్రం బలంగా జరుగుతోంది. అసెంబ్లీని నితీష్ రద్దు చేయకపోవచ్చని, బీజేపీ మద్దతుతో ఏడోసారి తిరిగి సీఎంగా ప్రమాణం చేస్తారనే ఒక ప్రచారం జరుగుతుండగా, ఎన్డీయే కూటమిలో చేరి లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని మరో ప్రచారం జరుగుతోంది. నితీష్ నిర్ణయం ఏదైనా అది 'ఇండియా' (I.N.D.I.A.) కూటమికి పెద్ద దెబ్బ అవుతుందని అంటున్నారు.