Delhi: లోక్‌సభ స్పీకర్ పదవిపై వీడిన సందిగ్ధత.. ఏ పార్టీకంటే?
ABN , Publish Date - Jun 19 , 2024 | 07:43 AM
ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌లో లోక్‌సభ స్పీకర్ పదవి(Lok Sabha Speaker Post) ఎవరిని వరిస్తుందనే చర్చకు ఫుల్ స్టాప్ పడినట్లే. స్పీకర్ పదవిని బీజేపీ తన దగ్గర ఉంచుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
ఢిల్లీ: ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌లో లోక్‌సభ స్పీకర్ పదవి(Lok Sabha Speaker Post) ఎవరిని వరిస్తుందనే చర్చకు ఫుల్ స్టాప్ పడినట్లే. స్పీకర్ పదవిని బీజేపీ తన దగ్గర ఉంచుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. డిప్యూటీ స్పీకర్ స్థానాన్ని ఎన్డీఏలోని మిత్రపక్షాలకు ఇవ్వాలని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. ఈ సీటు సంప్రదాయంగా ప్రతిపక్షానికి వెళుతుంది.
ఢిల్లీలో ఎన్డీయే నేతల సమావేశం
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో మంగళవారం.. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, భూపేందర్ యాదవ్, మనోహర్ లాల్, ధర్మేంద్ర ప్రధాన్, కిరణ్ రిజిజు, జైశంకర్, వీరేంద్ర కుమార్, అన్నపూర్ణా దేవి, ఎన్డీఏ నేతల సమావేశం జరిగింది. ఇందులో జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన లలన్ సింగ్, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ వంటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నేతలు కొంతమంది హాజరయ్యారు. లాలన్ సింగ్, చిరాగ్ పాశ్వాన్ ఇద్దరూ కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు.18వ లోక్‌సభ మొదటి సెషన్ జూన్ 24న ప్రారంభమవుతుంది. ఈ సెషన్‌లోలోక్ సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. స్పీకర్ ఎన్నిక జూన్ 26న జరుగుతుంది
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలపై వ్యూహాలు..
ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై చర్చించేందుకు మహారాష్ట్ర బీజేపీ కోర్ గ్రూప్ ప్రత్యేక సమావేశం మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, ఇతర పార్టీ ముఖ్య నేతల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.