Parliament: రామ మందిరం గురించి మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం: బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్
ABN , Publish Date - Feb 10 , 2024 | 11:43 AM
ఎన్డీఏ హయాంలో అయోధ్యలో రామ మందిర(Ayodhya Ram Mandir) నిర్మాణం పూర్తి కావడం, ఆలయం గురించి పార్లమెంటులో మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎంపీ సత్యపాల్ సింగ్ పేర్కొన్నారు.
ఢిల్లీ: ఎన్డీఏ హయాంలో అయోధ్యలో రామ మందిర(Ayodhya Ram Mandir) నిర్మాణం పూర్తి కావడం, ఆలయం గురించి పార్లమెంటులో మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎంపీ సత్యపాల్ సింగ్ పేర్కొన్నారు. అయోధ్య రామమందిరంపై బీజేపీ(BJP) ఎంపీలు సత్యపాల్ సింగ్, ప్రతాప్ చంద్ర సారంగి, సంతోష్ పాండే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల భారతీయుల కల సాకారం చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని అన్నారు. రాములవారి ఆశీర్వాదంతో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని పేర్కొన్నారు.
రాజ్యసభలో ఎంపీలు కె.లక్ష్మణ్, సుదాన్షు త్రివేది, రాకేష్ సిన్హా తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠపై సభలో చర్చ జరపనున్నారు. శనివారంతో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి