JP Nadda: జేపీ నడ్డాకు కీలక బాధ్యతలు..!
ABN , Publish Date - Jun 21 , 2024 | 07:24 PM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో ఆ పార్టీ నేతగా కొనసాగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జేపీ నడ్డా బీజేపీ అధ్యక్ష పదవి ఈ నెలతో ముగియనుంది. అయితే మరికొద్ది మాసాల్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
న్యూఢిల్లీ, జూన్ 21: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో ఆ పార్టీ నేతగా కొనసాగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జేపీ నడ్డా బీజేపీ అధ్యక్ష పదవి ఈ నెలతో ముగియనుంది. అయితే మరికొద్ది మాసాల్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల క్రతువు పూర్తయ్యే వరకు పార్టీ అధినేతగా కొనసాగాలంటూ పార్టీలోని అగ్రనాయకత్వం జేపీ నడ్డాకు సూచించినట్లు సమాచారం.
Also Read: Delhi High Court: బెయిల్ వచ్చినా.. మంగళవారం వరకు జైల్లోనే..
అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరొకరికి నియమించే అవకాశముంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి జేపీ నడ్డా రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. తాజాగా మోదీ కేబినెట్‌లో ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ తొలి కేబినెట్‌లో సైతం ఆయన ఇదే శాఖను నిర్వహించారు. ఇక 2020లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు జేపీ నడ్డాకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం విధితమే.
Also Read: PM Sheikh Hasina: రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన బంగ్లా ప్రధాని
Read Latest Telangana News and Telugu News