Share News

Dharavi redevelopment: ‘ధారావి’ ప్రాజెక్టు అదానీలకు కేటాయింపు సబబే

ABN , Publish Date - Dec 21 , 2024 | 03:53 AM

ముంబయిలోని ధారావి మురికివాడ పునర్నిర్మాణ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు కేటాయించడం సబబేనని శుక్రవారం బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది.

Dharavi redevelopment: ‘ధారావి’ ప్రాజెక్టు అదానీలకు కేటాయింపు సబబే

ముంబయి, డిసెంబరు 20: ముంబయిలోని ధారావి మురికివాడ పునర్నిర్మాణ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు కేటాయించడం సబబేనని శుక్రవారం బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. కాంట్రాక్టు మంజూరులో ఏకపక్ష ధోరణి, అహేతుకత, దుర్బుద్ధి వంటివి లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. 259 హెక్టార్లలో ఉన్న మురికివాడలో రూ.5,069 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అదానీ గ్రూపు టెండరు వేసింది. ఆకాశహర్మ్యాలు నిర్మించి పునరావాసం కల్పించడం ఈ ప్రాజెక్టులో ప్రధాన అంశం. అదానీ గ్రూపునకు ఈ కాంట్రాక్టు దక్కడాన్ని సవాలు చేస్తూ యూఏఈకి చెందిన సెక్‌లింక్‌ టెక్నాలజీస్‌ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. నిజానికి 2018లో తామే అతిపెద్ద బిడ్డర్‌గా నిలిచామని, కానీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలిచిందని తెలిపింది. అదానీ గ్రూపునకు టెండరు దక్కేలా చూసేందుకు నిబంధనలు సడలించిందని ఽఆరోపించింది.

Updated Date - Dec 21 , 2024 | 03:53 AM