Share News

Shilpa Shetty: రాజ్‌కుంద్రా రూ.100 కోట్ల ఆస్తులు సీజ్

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:36 PM

బిట్ కాయిన్ కుంభకోణంతో ప్రమేయమున్న వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఆస్తులను ఈడీ గురువారం సీజ్ చేసింది. దాదాపు రూ. 100 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. ముంబై జూహులోని ఫ్లాట్‌తోపాటు పుణేలోని బంగ్లాను సైతం సీజ్ చేసిన వాటిలో ఉన్నాయి.

Shilpa Shetty: రాజ్‌కుంద్రా రూ.100 కోట్ల ఆస్తులు సీజ్
Raj Kundra,Shilpa Shetty

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బిట్ కాయిన్ కుంభకోణంలో ప్రమేయమున్న వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సీజ్ చేసింది. దాదాపు రూ.100 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. ముంబై జూహులోని ఫ్లాట్‌తోపాటు పుణేలోని బంగ్లా సైతం సీజ్ చేసిన వాటిలో ఉన్నాయి. అయితే పుణేలోని బంగ్లా రాజ్ కుంద్రా భార్య, ప్రముఖ నటి శిల్ప శెట్టి పేరు మీద ఉన్నట్లు సమాచారం. సీజ్ చేసిన వాటి మొత్తం విలువ రూ.97.79 కోట్ల వరకు ఉంటుందని అంచనాగా ఉంది.

అలాగే రాజ్ కుంద్రా పేరున ఉన్న ఈక్విటీ షేర్లును సైతం సీజ్ చేశారు. మీరు పెట్టుబడులు పెట్టండి.. అనంతరం ప్రతి నెల 10 శాతం లాభం మీకు అందిస్తామంటూ 2017లో రూ.6,600 కోట్లు వసూలు చేశారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌పై మహారాష్ట్ర, న్యూఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులోభాగంగా అమిత్ భరద్వాజ, అజయ్ భరద్వాజ, వివేక్ భరద్వాజ, సింపి భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్, తదితరులపై కేసు నమోదు చేశారు.

Wines: ఒకే రోజు రూ.400 కోట్ల మద్యం విక్రయాలు.. ఇళ్లల్లో స్టాక్‌ పెట్టుకున్న మందుబాబులు..


అనంతరం ఈ కేసు ఈడీ దర్యాప్తు చేపట్టింది.. పెట్టుబడి పెట్టిన వారిని ప్రమోటర్స్ మోసం చేసినట్లు గుర్తించింది. అలాగే అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా 285 బీట్ కాయిన్లు అందుకున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. మరికొన్ని ఆస్తులు రూపంలో ఉన్నట్లు ఈడీ గుర్తించింది. మనిల్యాండరింగ్ నిరోధక చట్టం 2002 ప్రకారం ఈ ఆస్తులను సీజ్ చేసింది. మరోవైపు రాజ్ కుంద్రా భార్య శిల్పశెట్టికి సైతం ఈడీ నోటిసులు జారీ చేసింది.

Encounter Laxman: ఆ సమయంలో టీమ్ సహకారం చాలా అవసరం.. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ లక్ష్మణ్..

మరోవైపు 2021లో రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. హాట్ షాట్స్ యాప్ ద్వారా.. పోర్నోగ్రఫి పిల్మ్స్ రూపొందించిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. అనంతరం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. రాజ్ కుంద్రా విడుదలయ్యారు.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 18 , 2024 | 03:38 PM