Share News

అన్ని రైళ్లకు సీసీ కెమెరాలు: అశ్వినీ వైష్ణవ్‌

ABN , Publish Date - Sep 12 , 2024 | 05:12 AM

దేశంలోని అన్ని రైళ్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఇటీవల కాలంలో దుండగులు రైలు పట్టాలపై సిమెంటు దిమ్మెలు, రాళ్లు పెడుతున్న ఘటనలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

అన్ని రైళ్లకు సీసీ కెమెరాలు: అశ్వినీ వైష్ణవ్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: దేశంలోని అన్ని రైళ్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఇటీవల కాలంలో దుండగులు రైలు పట్టాలపై సిమెంటు దిమ్మెలు, రాళ్లు పెడుతున్న ఘటనలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి ఇంజన్‌కు ముందు, వెనుక, గార్డు కోచ్‌కు కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు, రైల్వే ట్రాక్‌ల వద్ద మిగిలిపోయిన ఇంజినీరింగ్‌ పరికరాలు, మెటీరియల్‌ను తక్షణమే తొలగించాలని రైల్వే బోర్డు అన్ని రైల్వే జోన్ల అధికారులను ఆదేశించింది. పట్టాలపై గ్యాస్‌ సిలిండర్లు, సిమెంటు బ్లాకుల వంటివి ఉంచి రైళ్లను పట్టాలు తప్పించడానికి దుండగుల ప్రయత్నాల దృష్ట్యా బోర్డు ఈ ఆదేశాలు ఇచ్చింది.

Updated Date - Sep 12 , 2024 | 05:12 AM