Elections date: ఎన్నికల తేదీపై క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
ABN , Publish Date - Jan 23 , 2024 | 07:18 PM
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌పై రాజకీయ పార్టీలతో పాటు దేశవ్యాప్తంగా ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రానున్న ఐదేళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయించే ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఏప్రిల్ 16, 2024న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై క్లారిటీ వచ్చింది.
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌పై రాజకీయ పార్టీలతో పాటు దేశవ్యాప్తంగా ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రానున్న ఐదేళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయించే ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఏప్రిల్ 16, 2024న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుందంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కసరత్తుకు సంబంధించి అధికారులకు ఈసీ గతంలో డెడ్‌లైన్‌గా విధించిన తేదీని ప్రతిపాదిత ఎన్నికల తేదీగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల సంఘం ప్లానింగ్ ప్రకారం కార్యకలాపాలను పూర్తి చేయడానికి గడువు తేదీగా ఏప్రిల్ 16 సూచించామని, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌తో దీనికి ఎలాంటి సంబంధంలేదని వివరణ ఇచ్చారు.