Share News

Kolkata Incident: కోల్‌కతా హత్యాచార ఘటన.. వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు!

ABN , Publish Date - Aug 11 , 2024 | 07:51 PM

కోల్‌కతా ట్రెయినీ వైద్యురాలి అత్యాచార ఘటనలో షాకింగ్ విషయాలో వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి మృతదేహంపై పలు గాయాలు ఉన్నాయని, ఆమెపై దారుణ దాడి జరిగినట్టు ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక తేల్చింది.

Kolkata Incident: కోల్‌కతా హత్యాచార ఘటన.. వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు!

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా ట్రెయినీ వైద్యురాలి అత్యాచార ఘటనలో (Kolkata Incident) షాకింగ్ విషయాలో వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి మృతదేహంపై పలు గాయాలు ఉన్నాయని, ఆమెపై దారుణ దాడి జరిగినట్టు ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక తేల్చింది. ‘‘ఆమె రెండు

కళ్లు, నోటి నుంచి రక్తం కారింది. ముఖం, చేతిగోళ్లపై గాయాలున్నాయి. మర్మాంగాల నుంచి రక్తస్రావం జరిగినట్టు ప్రాథమిక నివేదికలో తేలింది. బాధితురాలిది ఆత్మహత్య కాదని ప్రాథమిక నివేదిక తేల్చింది (Chilling Details In Kolkata trainee post graduate incident ).

‘‘ఇది కచ్చితంగా సూసైడ్ కేసు కాదు. లైంగిక దాడి తరువాత హత్య జరిగింది.’’ అని పోలీసు అధికారి ఒకరు తేల్చారు. ‘ఆమె మెడ ఎముకలు కూడా పలు చోట్ల విరిగిపోయాయి. బాధితురాలి గొంతును పట్టి ఊపిరాడకుండా చేసి ఉండొచ్చు’’ అని మరో పోలీసు అధికారి పేర్కొన్నారు.

West Bengal: కోల్‌కతా హత్యాచార ఘటన.. ఆసుపత్రి సూపరింటెండెంట్ తొలగింపు


బాధితురాలు ఛాతి వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థిగా ఉన్నారు. ఘటన జరిగిన రోజు రాత్రి ఆమె నైట్ డ్యూటీ చేశారు. శుక్రవారం కాలేజీ సెమినార్ హాల్‌లో బాధితురాలి మృతదేహం లభించింది. ‘‘తన జూనియర్స్‌తో కలిసి ఆ రాత్రి ఆమె భోజనం చేసింది. రెస్ట్ తీసుకునేందుకు ప్రత్యేక ఆన్‌కాల్ రూం ఏదీ లేకపోవడంతో ఆమె సెమినార్ హాల్‌లోకి వెళ్లిందని’’ ఆసుపత్రిలోని డాక్టర్ ఒకరు మీడియాకు తెలిపారు.

కాగా, నిందితుడు వాలంటీర్‌గా పనిచేస్తున్నట్టు మీడియాలో వస్తున్న కథనాలపై పోలీసులు స్పందించలేదు. ఘటనాస్థలంలో లభించిన బ్లూ టూత్ హెడ్‌సెట్ సాయంతో పోలీసులు నిందితుడి ఆచూకీ కనుక్కున్నట్టు తెలిసింది.


ఈ ఘటనతో పశ్చిమ బెంగాల్‌ను నిరసనలు మిన్నంటాయి. వైద్యులు, వైద్య విద్యార్థుల నిరసనలకు దిగారు. ఘటనపై ఏ ప్రభుత్వ సంస్థ దర్యాప్తు చేసినా తమకు అభ్యంతరం లేదని అధికార టీఎంసీ ప్రకటించింది. ఇలాంటి ఘటనల్లో నిందితులకు మరణ శిక్ష విధించాలి లేదా ఎన్‌కౌంటర్ చేయాలని టీఎంసీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇలాంటి నిందితులపై తక్షణ చర్యలు తీసుకునేందుకు కేంద్రం ఓ ఆర్డినెన్స్ తీసుకురావాలని అన్నారు.

Read National and Telugu News

Updated Date - Aug 11 , 2024 | 07:51 PM