2030 నాటికి చైనా వద్ద వెయ్యి అణ్వాయుధాలు!
ABN , Publish Date - Dec 20 , 2024 | 03:28 AM
చైనా అణ్వాయుధాల తయారీలో వేగం పెంచిం ది. ఈ ఏడాది ఇప్పటికే కనీసం 100 అణ్వస్త్రాలను తయారు చేసింది.
ఈ ఏడాది ఇప్పటికే 100 తయారు.. ‘పెంటగాన్’ వెల్లడి
వాషింగ్టన్, డిసెంబరు 19: చైనా అణ్వాయుధాల తయారీలో వేగం పెంచిం ది. ఈ ఏడాది ఇప్పటికే కనీసం 100 అణ్వస్త్రాలను తయారు చేసింది. ఇదే వేగం కొనసాగిస్తే 2030 నాటికి చైనా అమ్ములపొదిలో 1,000 అణ్వాయుధాలు సమకూరనున్నాయి. చైనా మిలిటరీకి సంబంధించి అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్ తాజాగా రూపొందించిన వార్షిక నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం చైనా వద్ద 600కు పైగా అణ్వాయుధాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2019లో వీటి సంఖ్య 400 మాత్రమేనని, 2023 మే నాటికి ఆ సంఖ్య 500కు పెరిగిందని తెలిపింది. ఈ ఏడాది వాటిసంఖ్య ఏకంగా 20ు పెరిగి 600కు చేరడం గమనార్హం. తమ జాతీయ భద్రతకు సరిపడా అణ్వాయుధాలు ఉంచుకొంటామని ఇప్పటికే చైనా తేల్చిచెప్పింది. కాగా, 2023 నాటికి అమెరికా వద్ద దాదాపు 3,748 అణ్వాయుధాలు ఉన్నాయి. చైనా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఆ దేశ అణు సామర్థ్యాన్ని మరింత పెంచాయని పెంటగాన్ నివేదిక తెలిపింది. చైనా రక్షణ వ్యయాన్ని భారీగా పెంచేసినట్టు వివరించింది.