Share News

Protests in Thane: స్కూల్లో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపులు

ABN , Publish Date - Aug 20 , 2024 | 02:10 PM

దేశంలో వయసు భేదం లేకుండా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలు తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తు్నాయి. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌లో డ్యూటీలో ఉన్న ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచారాన్ని మరువక ముందే మరో దారుణం వెలుగుచూసింది.

Protests in Thane: స్కూల్లో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపులు

దేశంలో వయసు భేదం లేకుండా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులు, నేరాలు తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌లో డ్యూటీలో ఉన్న ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచారాన్ని మరువక ముందే మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మహారాష్ట్రలోని థానే నగరంలో ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇద్దరు చిన్నారులు లైంగిక వేధింపులకు గురయ్యారు. స్కూల్ టాయిలెట్‌లో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులను పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న 23 ఏళ్ల ఓ యువకుడు లైంగికంగా వేధించాడు. ఆగస్టు 16న జరిగిన ఈ ఘటనపై థానేలో ఇవాళ (మంగళవారం) ఒక్కసారిగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనకారులు బాదల్‌పూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి ముంబై రైలు మార్గంపై నిరసన తెలిపారు. దీంతో రైలు సేవలు నిలిచిపోయాయి.


కాగా ఈ ఘటనకు సంబంధించిన నిందిత యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదయింది. అతడు ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక ఈ ఘటనపై చర్యలు తీసుకున్న స్కూల్ యాజమాన్యం.. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. అంతేకాదు క్లాస్ టీచర్, ఆయాను కూడా తొలగించింది. అయినప్పటికీ ఈ చర్యల పట్ల పిల్లల తల్లిదండ్రులు శాంతించలేదు. పిల్లలపై జరిగిన లైంగిక దాడుల విషయంలో బాధ్యత వహించే విషయంలో స్కూల్ యాజమాన్యం విఫలమైందని, యాజమాన్యం నుంచి అధికారికంగా ఎలాంటి క్షమాపణ చెప్పకపోవడంపై తల్లిదండ్రులు, ఆందోళనకారులు మండిపడుతున్నారు.


మరోవైపు.. పోలీసుల దర్యాప్తులో స్కూల్ భద్రతా చర్యల్లో అనేక లోపాలు వెలుగుచూశాయి. బాలికలు వినియోగించే టాయిలెట్లలో మహిళా సహాయకులు లేరని గుర్తించారు. ఈ స్కూల్‌‌లో ప్రాథమిక భద్రత అవసరమని దర్యాప్తులో వెల్లడైంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. స్కూల్లో అమర్చిన అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో చాలా పనిచేయడం లేదని తేలింది.

Updated Date - Aug 20 , 2024 | 02:21 PM