Share News

PM Modi: మోదీ మీరే డీల్ చేయాలి.. లేకుంటే మూడో ప్రపంచ యుద్ధమే..

ABN , Publish Date - Oct 11 , 2024 | 01:48 PM

యురేషియాతోపాటు పశ్చిమాసియాలో శాంతిసుస్థిరతను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని ప్రపంచ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయా దేశాల్లో జరుగుతున్న ఘర్షణలు.. గ్లోబల్ సౌత్ దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

PM Modi: మోదీ మీరే డీల్ చేయాలి.. లేకుంటే మూడో ప్రపంచ యుద్ధమే..

వియత్నాం, అక్టోబర్ 11: యురేషియాతోపాటు పశ్చిమాసియాలో శాంతిసుస్థిరతను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని ప్రపంచ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయా దేశాల్లో జరుగుతున్న ఘర్షణలు.. గ్లోబల్ సౌత్ దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం వియాత్నాంలో జరుగుతున్న 19వ తూర్పు ఆసియా సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ ఘర్షణలను నివారించేందుకు ప్రయత్నించాలని ప్రపంచదేశాలకు సూచించారు. తాను బుద్ధుడు జన్మించిన దేశం నుండి వచ్చానన్నారు. అయితే యుద్ధరంగంలో సమస్యలకు పరిష్కారాలు మాత్రం దొరకవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.


సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతతోపాటు అంతర్జాతీయ చట్టాలను సైతం గౌరవించాల్సి ఉందన్నారు. చర్చలకు, దౌత్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఆ క్రమంలో విశ్వ బంధు భారత్.. అన్ని విధాలుగా సహకరాన్ని అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఆ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్బంగా పక్కనే ఉన్న మయన్మార్‌తో భారత్ కలిసి నడుస్తుందన్నారు. పొరుగుదేశం భారత్.. తన బాధ్యతను కొనసాగిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో తూర్పు ఆసియా సదస్సు అత్యంత ముఖ్యమైనదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు.


మోదీ మీరే డీల్ చేయాలి.. లేకుంటే మూడో ప్రపంచ యుద్ధమే..

ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాక్ దేశాల మధ్య పోరు రోజూ రోజుకు తీవ్రతరం అవుతుంది. అలాగే పలు దేశాల మధ్య సంబంధాలు సైతం ఉప్పు నిప్పు తరహాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం లండన్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ జ్యూరిట్స్ అండ్ రైటర్స్ ఫర్ వరల్డ్ ఫీస్ స్పందించింది. ఈ ఘర్షణలను నిలుపుదల చేసేందుకు శాంతి దౌత్యం జరపాలని ప్రధాని మోదీకి ఈ ప్రపంచ సదస్సు‌లో పాల్గొన్న ప్రముఖులు విజ్జప్తి చేశారు. అందుకోసం వెంటనే రంగంలోకి దిగాలని వారు సూచించారు. లేకుంటే మూడో ప్రపంచ యుద్దం వచ్చే అవకాశముందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

For National News And Telugu News

Updated Date - Oct 11 , 2024 | 02:06 PM