Share News

జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తాం

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:14 AM

‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అనేది రాజ్యాంగ మూల స్వరూపానికి విరుద్ధమని, ఈ ఆలోచనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ శుక్రవారం స్పష్టం చేసింది.

జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తాం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 20: ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అనేది రాజ్యాంగ మూల స్వరూపానికి విరుద్ధమని, ఈ ఆలోచనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ శుక్రవారం స్పష్టం చేసింది. ఒకే దేశం, ఒకే ఎన్నిక ఆలోచన అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకమే కాకుండా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. జమిలి ఎన్నికలు నిర్వహించేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే బిల్లులను ప్రవేశపెట్టే సమయంలో 272 మంది ఎంపీలను కూడబెట్టలేకపోయిన ప్రభుత్వం.. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని ఎలా సమకూర్చుకుంటుందని జైరామ్‌ రమేష్‌ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నోటీసు కేవలం ట్రైలర్‌ మాత్రమేనని జైరామ్‌ రమేష్‌ అన్నారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో చైర్మన్‌పై మళ్లీ విపక్షాలు అభిశంసన నోటీసు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 04:14 AM