Congress: బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బ్లాక్ పేపర్..!అసలేంటిది
ABN , Publish Date - Feb 08 , 2024 | 08:08 AM
కాంగ్రెస్(Congress) పాలనలో దేశ ఆర్థిక పరిస్థితిని, ప్రస్తుత ఎన్డీఏ సర్కార్‌తో పోల్చుతూ బీజేపీ(BJP) శ్వేత పత్రం(White Paper) విడుదల చేయడానికి సిద్ధమయింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే క్రోడీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీ: కాంగ్రెస్(Congress) పాలనలో దేశ ఆర్థిక పరిస్థితిని, ప్రస్తుత ఎన్డీఏ సర్కార్‌తో పోల్చుతూ బీజేపీ(BJP) శ్వేత పత్రం(White Paper) విడుదల చేయడానికి సిద్ధమయింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే క్రోడీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిని గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే బీజేపీకి పోటీగా కాంగ్రెస్ కూడా బ్లాక్ పేపర్ ప్రవేశ పెట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ఈ పేపర్‌లో పదేళ్ల నరేంద్ర మోదీ పాలన వైఫల్యాలను ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ హయాంలో పెరిగిన ధరలు, నిరుద్యోగం రేటు తదితర అంశాలను బ్లాక్ పేపర్(Black Paper)లో వివరిస్తారు. దీనిని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్ సభలో బయటపెట్టే అవకాశం ఉంది. ఇలా అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలతో లోక్ సభ ఎన్నికలకు చాలా రోజుల ముందుగానే రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి