Home » Mallikarjun Kharge
మోదీ ప్రభుత్వంలో అంబేద్కర్‌పై గౌరవం మాటలకే పరిమితమని, ఆయన ఆశయాలను నెరవేర్చే ఉద్దేశం వారికి లేదని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. బాబాసాహెబ్ బౌద్ధమతం తీసుకున్నప్పుడు కూడా హిందూ సంస్థల నుంచి ఆయనకు తీవ్ర ప్రతిఘటన ఎదురైందని చెప్పారు.
బీజేపీపై ఖర్గే విమర్శలు గుప్పిస్తూ, భవిష్యత్ సవాళ్లను పరిష్కరించే బదులు శతాబ్దాల క్రితం నాటి అంశాలను పైకి తెస్తూ మతపరమైన విభజనలను పెంచుతోందని అన్నారు. అలాంటి ప్రమాదకరమైన ఆలోచనలను పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు.
మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మధ్య ఉన్న సత్సంబంధాలను వక్రీకరించడంతో పాటు అనేక మంది జాతి హీరోలను కించపరచేలా బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
CWC Meetings: అహ్మదాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
వక్ఫ్ భూమిని కబ్జా చేశారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ బుధవారం లోక్‌సభలో చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.
Janareddy Letter: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేల తరపున ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కేసీ వేణుగోపాల్‌కు సీనియర్ నేత జానా రెడ్డి లేఖ రాశారు.
కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షులే ఫ్రంట్ వారియర్స్ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. డీసీసీ అధ్యక్షులు అంటే పార్టీకి దూతలు కాదని, రక్షణ రేఖలని చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం తదితర అంశాలపై చర్చలు జరిపారు
రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మంగళవారం దుమారం రేగింది. డిప్యూటీ చైర్మన్‌ను ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాత్రమే చేశానని వివరణ ఇచ్చిన ఖర్గే.. డిప్యూటీ చైర్మన్‌కు క్షమాపణ చెప్పారు.
రాజ్యసభలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయం అనంతరం విద్యాశాఖ పనితీరుపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఖర్గే జోక్యం చేసుకుంటూ, తాను ఉదయం మాట్లాడినప్పుడు విద్యాశాఖ మంత్రి సభలో లేరని, కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని అన్నారు.