అవినీతి కేసులో షేక్ హసీనాపై దర్యాప్తు
ABN , Publish Date - Dec 25 , 2024 | 04:34 AM
అణు విద్యుత్ కేంద్రం నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(77), కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది.
చెల్లెలి కుమార్తె అయిన బ్రిటన్ ఆర్థిక మంత్రి తులిప్ సిద్దికీపై కూడా
ఢాకా/న్యూఢిల్లీ, డిసెంబరు 24: అణు విద్యుత్ కేంద్రం నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(77), కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. హైకోర్టు ఆదేశాల మేరకు దీనిపై యాంటీ కరప్షన్ కమిషన్ (ఏసీసీ) దర్యాప్తు ప్రారంభించింది. రాజధాని ఢాకాకు 160 కి.మీ.దూరంలోని రోప్పూర్‌లో రష్యా ప్రభుత్వ రంగ సంస్థ అయిన రోసటోమ్ సాయంతో 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.43వేల కోట్లు) వ్యయంతో ఈ అణు విద్యుత్తు కేంద్రం నిర్మాణం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన నిధులను మలేసియా బ్యాంకుకు మళ్లించారని, ఇందుకు షేక్ హసీనాతో పాటు ఆమె కుమారుడు సజీబ్ వాజేద్ జాయ్, ఆమె చెల్లిలి కుమార్తె, బ్రిటన్ ఆర్థిక మంత్రి తులిప్ సిద్దికీలను ఎందుకు ప్రశ్నించకూడదని హైకోర్టు ప్రశ్నించింది. దాంతో ఆమెతో పాటు, కుటుంబ సభ్యులపైనా ఏసీసీ దర్యాప్తు చేయనుంది.