Share News

కోర్టు ధిక్కరణ కేసులో పిచాయ్‌కు నోటీసులు

ABN , Publish Date - Dec 03 , 2024 | 03:55 AM

వీడియోను తొలగించాలన్న ఆదేశాలను పాటించలేదన్న కారణంతో ముంబయి బల్లార్డ్‌ పియర్‌లోని అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేటు న్యాయస్థానం గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు పంపించింది.

కోర్టు ధిక్కరణ కేసులో పిచాయ్‌కు నోటీసులు

ముంబయి, డిసెంబరు 2: వీడియోను తొలగించాలన్న ఆదేశాలను పాటించలేదన్న కారణంతో ముంబయి బల్లార్డ్‌ పియర్‌లోని అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేటు న్యాయస్థానం గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు పంపించింది. యూట్యూబ్‌లో తనపై పెట్టిన వీడియో పరువు నష్టం కలిగించేదిగా ఉందంటూ తొలుత ధ్యాన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు యోగి అశ్విని కోర్టును ఆశ్రయించారు. దాన్ని తొలగించాలని మార్చి 2023న కోర్టు ఆదేశించింది. ఆ వీడియోను ఇంకా పూర్తిగా తొలగించలేదని, భారత్‌లో మినహా మిగిలిన చోట్ల అందుబాటులో ఉందని పిటిషనర్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. దాంతో సమాధానం ఇవ్వాలని యూట్యూబ్‌ అధిపతి పిచాయ్‌కు కోర్టు నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి మూడో తేదీకి వాయిదా వేసింది.

Updated Date - Dec 03 , 2024 | 03:55 AM