Share News

Odisha: బాలాసోర్‌లో ఉద్రిక్తత.. కర్ఫ్యూ విధింపు

ABN , Publish Date - Jun 18 , 2024 | 01:25 PM

బక్రీద్ పర్వదినం సందర్బంగా ఒడిశాలోని బాలాసోర్ పట్టణంలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గత అర్థరాత్రి నుంచి పట్టణంలో పోలీసులు కర్ప్యూ విధించారు.

Odisha: బాలాసోర్‌లో ఉద్రిక్తత.. కర్ఫ్యూ విధింపు

భువనేశ్వర్, జూన్ 18: బక్రీద్ పర్వదినం సందర్బంగా ఒడిశాలోని బాలాసోర్ పట్టణంలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గత అర్థరాత్రి నుంచి పట్టణంలో పోలీసులు కర్ప్యూ విధించారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని రహదారిపై బలి ఇచ్చిన జంతువు రక్తాన్ని నిరసిస్తూ ఓ వర్గం ఆందోళన దిగింది. అందుకు మరో వర్గం ఆగ్రహించింది. దాంతో ఆందోళన చేస్తున్న వర్గంపై రాళ్ల దాడికి దిగింది. దీంతో ఇరు వర్గాలు మధ్య పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో ప్రజలతోపాటు పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే 20 పోలీసుల వాహనాలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి.


ఈ ఘర్షణపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ.. జిల్లా కలెక్టర్‌ అశీష్ ఠాక్రేకు ఫోన్ చేసి ఆరా తీశారు. పరిస్థితులను వెంటనే అదుపులోకి తీసుకు రావాలని ఠాక్రేను సీఎం ఆదేశించారు. మరోవైపు బాలాసోర్ మున్సిపల్ పరిధిలో కర్ప్యూ విధించామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. పరిస్థితి ప్రస్తుత అదుపులో ఉందన్నారు. కర్ప్యూలో భాగంగా ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేసినట్లు తెలిపారు. అత్యవసర వైద్య సేవలకు తప్పించిన ఎవరు బైటకు రావద్దని ప్రజలకు జిల్లా యంత్రాంగం ఈ సందర్బంగా సూచించింది. Read Latest Telangana News and National News

Updated Date - Jun 18 , 2024 | 01:25 PM