Bole Baba: తొలిసారి మీడియా ముందుకు భోలే బాబా.. హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే
ABN , Publish Date - Jul 06 , 2024 | 10:27 AM
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్(Hathras)లో తీవ్ర విషాదాన్ని నింపిన తొక్కిసలాట ఘటనపై సత్సంగ్ నిర్వహించి 121 మంది మృతికి కారణమైన భోలేబాబా(Bhole Baba) తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. తొక్కిసలాట తర్వాత పరారీలో ఉన్న అతను ఈ ఘటన తనను తీవ్రంగా బాధపెట్టిందని చెప్పాడు.
లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్(Hathras)లో తీవ్ర విషాదాన్ని నింపిన తొక్కిసలాట ఘటనపై సత్సంగ్ నిర్వహించి 121 మంది మృతికి కారణమైన భోలేబాబా(Bhole Baba) తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. తొక్కిసలాట తర్వాత పరారీలో ఉన్న అతను ఈ ఘటన తనను తీవ్రంగా బాధపెట్టిందని చెప్పాడు. “ఘటన మిగిల్చిన విషాదాన్ని భరించే శక్తి దేవుడు మాకు ప్రసాదించాలి.
ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచండి. కారకులను విడిచిపెట్టరనే విశ్వాసం నాకుంది. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి జీవితాంతం అండగా నిలబడాలని, వారికి సాయం చేయాలని నా న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా కమిటీ సభ్యులను అభ్యర్థించాను” అని మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
నామమాత్ర పరిహారం..
121 మంది మృతుల కుటుంబ సభ్యులకు నామమాత్ర పరిహారం ప్రకటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయి. వారి కుటుంబాల భవిష్యత్తు ఏంటని భోలేబాబా లాయర్ ఏపీ సింగ్‌ని ప్రశ్నించగా.. మృతుల జాబితాలు తమ వద్ద ఉన్నట్లు చెప్పారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాల పిల్లల చదువు, ఆరోగ్యం, పెళ్లి ఖర్చులను భోలే బాబాకు చెందిన నారాయణ్ సాకర్ హరి ట్రస్టే భరిస్తుందని వివరించారు.
ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఎలాంటి సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో సమావేశానికి లక్షల్లో హాజరైనట్లు చెప్పారు. 80 వేలకు అనుమతి ఉండగా.. లక్షల్లో హాజరైనట్లు తెలిపారు. భోలే బాబా పరారీలో లేడని.. విచారణకు అతను సహకరిస్తారని లాయర్ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే ఆరుగురు వాలంటీర్లను అరెస్ట్ చేశారు.
For Latest News and National News click here