Delhi: ఈ తేదీల్లో ఢిల్లీలో నో ఫ్లైయింగ్ జోన్ అమలు.. ఎందుకంటే
ABN , Publish Date - Jun 08 , 2024 | 08:13 AM
లోక్ సభ ఎన్నికలు పూర్తికావడంతో ఎన్డీఏ(NDA) కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 9న ప్రధానిగా మూడోసారి మోదీ(PM Modi) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పా్ట్లు పూర్తయ్యాయి.
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు పూర్తికావడంతో ఎన్డీఏ(NDA) కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 9న ప్రధానిగా మూడోసారి మోదీ(PM Modi) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పా్ట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ కమీషనర్ సంజయ్ అరోరా ఢిల్లీని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు.
ఢిల్లీలో ఎలాంటి డ్రోన్, పారాగ్లైడింగ్, పారాజంపింగ్, రిమోట్ ఆపరేట్ పరికరాలపైనా నిషేధం విధించారు. దీంతో ఢిల్లీ నో ఫ్లయింగ్ జోన్‌గా మారిపోయింది. జూన్ 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ప్రమాణ స్వీకార సమయం ఇదే..
మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రధానమంత్రి, ఇతర మంత్రి మండలి సభ్యులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారని రాష్ట్రపతి భవన్ నుంచి శుక్రవారం రాత్రి అధికారిక ప్రకటన వెలువడింది. అంతకు ముందు మోదీని ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నామని, ఆయనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కూటమికి చెందిన నేతలందరూ రాష్ట్రపతి ముర్మును కలిసి సంయుక్త లేఖను సమర్పించారు.
ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలన్నీ మోదీని ప్రధానిగా సమర్థిస్తూ వేర్వేరు లేఖలను కూడా రాష్ట్రపతికి అందజేశాయి.ఇదిలా ఉండగా, రాష్ట్రపతి అభ్యర్థన మేరకు ప్రధాని మోదీ తన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి తేదీ సమయాన్ని సూచించారు.
ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఢిల్లీని 9, 10 తేదీల్లో నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. రాష్ట్రపతితో భేటీ తర్వాత బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తన నివాసంలో మిత్రపక్షాల నేతలతో వేర్వేరుగా చర్చలు జరిపారు.చంద్రబాబు, నితీశ్ కుమార్, ఏక్‌నాథ్ షిండే, పవన్ కల్యాణ్, చిరాగ్ పశ్వాన్, జయంత్ చౌదరి, అనుప్రియ పాటిల్, అజిత్ పవార్‌లు నడ్డాతో చర్చలు జరిపారు.
For Latest News and National News click here