Share News

Delhi High Court : పూజా ఖేడ్కర్‌కు ముందస్తు బెయిల్‌ నిరాకరణ

ABN , Publish Date - Dec 24 , 2024 | 06:47 AM

ఫోర్జరీ కేసులు ఎదుర్కొంటున్న మాజీ ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం ముందస్తు బెయిల్‌ నిరాకరించింది. మానసిక, శారీరక వైకల్యం ఉన్నట్టు, ఓబీసీకి చెందినట్టు

 Delhi High Court  : పూజా ఖేడ్కర్‌కు ముందస్తు బెయిల్‌ నిరాకరణ

న్యూఢిల్లీ, డిసెంబరు 23: ఫోర్జరీ కేసులు ఎదుర్కొంటున్న మాజీ ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం ముందస్తు బెయిల్‌ నిరాకరించింది. మానసిక, శారీరక వైకల్యం ఉన్నట్టు, ఓబీసీకి చెందినట్టు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగం పొందడంతో యూపీఎస్సీ ఆమెను తొలగించింది. కేసు కూడా నమోదు చేసింది. దాంతో అరెస్టు చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం ఆమె అధికారులనే కాకుండా మొత్తం సమాజాన్నే మోసం చేసినట్టు కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఈ కుట్రపై లోతుగా విచారణ జరగాల్సి ఉన్నందున ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని పేర్కొంది.

Updated Date - Dec 24 , 2024 | 06:47 AM