Dating App: డేటింగ్ యాప్ పరిచయం.. దాడి చేసి రూ.75 వేలు దోచుకెళ్లిన దుండగులు
ABN , Publish Date - Jan 12 , 2024 | 09:32 PM
సోషల్ మీడియాలో(Social Media) ఓ పరిచయం అతడ్ని నిలువుదోపిడి చేసింది. ఢిల్లీలోని సంగమ్ విహార్ కి చెందని ఒక వ్యక్తి డేటింగ్ యాప్(Dating App) ద్వారా ఒకతడ్ని పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత వారిరువురు కలవాలని నిర్ణయించుకున్నారు. సంగమ్ విహార్ లోని ఓ ప్రాంతంలో కలుద్దామని డిసెంబర్ 8న మాట్లాడుకున్నారు.
ఢిల్లీ: సోషల్ మీడియాలో(Social Media) ఓ పరిచయం అతడ్ని నిలువుదోపిడి చేసింది. ఢిల్లీలోని సంగమ్ విహార్ కి చెందని ఒక వ్యక్తి డేటింగ్ యాప్(Dating App) ద్వారా ఒకతడ్ని పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత వారిరువురు కలవాలని నిర్ణయించుకున్నారు. సంగమ్ విహార్ లోని ఓ ప్రాంతంలో కలుద్దామని డిసెంబర్ 8న మాట్లాడుకున్నారు. స్పాట్ కి చేరుకోగానే డేటింగ్ యాప్ పరిచయస్తుడు మరో ఇద్దరిని అక్కడికి పిలిపించాడు. అనంతరం బాధితుడిపై వారంతా కలిసి దాడికి పాల్పడ్డారు.
అతని ఫోన్ తో పాటు.. ఫోన్ పే పాస్ వర్డ్ తెలుసుకుని అకౌంట్లో ఉన్న రూ.75 వేలు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. అతన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. బాధితుడు తాజాగా తనకు జరిగిన అన్యాయం గురించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీసీపీ అంకిత్ చౌహాన్ తెలిపారు. వారందరినీ గురువారం వెతికిపట్టుకున్నామని చెప్పారు.
ఇందులో ఇద్దరు హరియాణా రాష్ట్రం ఫరిదాబాద్ కి చెందిన అభిషేక్ అని, సరితా విహార్ కి చెందిన అమన్ సింగ్ గా గుర్తించామన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు హెచ్చరించారు. ఆన్ లైన్లో ఎవరితోనైనా స్నేహం చేయాలని చూస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని చెప్పారు. నకిలీ వెబ్ సైట్లు, ఫేక్ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ఎక్కువైపోయాయని వివరించారు. అలాంటివాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.