Share News

Delhi Water Crisis: మంచి నీటి కోసం ఆందోళనకు దిగిన బీజేపీ శ్రేణులు.. ఢిల్లీ పోలీసులు ఏం చేశారంటే..?

ABN , Publish Date - Jun 22 , 2024 | 05:09 PM

దేశ రాజధాని న్యూడిల్లీలో శనివారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. న్యూఢిల్లీలో నీటి కొరత రోజు రోజుకు తీవ్రమవుతుంది. దీంతో మంచి నీటి కోసం భారీగా ప్రజలు క్యూ కడుతున్నారు.

Delhi Water Crisis: మంచి నీటి కోసం ఆందోళనకు దిగిన బీజేపీ శ్రేణులు.. ఢిల్లీ పోలీసులు ఏం చేశారంటే..?

న్యూఢిల్లీ, జూన్ 22: దేశ రాజధాని న్యూడిల్లీలో శనివారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. న్యూఢిల్లీలో నీటి కొరత రోజు రోజుకు తీవ్రమవుతుంది. దీంతో మంచి నీటి కోసం భారీగా ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు మంచి నీటిని విడుదల చేయాలంటూ ఓక్లాలోని జల్ బోర్డ్ పంపింగ్ స్టేషన్ వద్ద బీజేపీ నేత రమేశ్ బిదురీ సారథ్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై బీజేపీ నేత రమేశ్ బిదురీ వ్యంగ్య ఆరోపణలు సంధించారు. అయితే ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో బీజేపీ శ్రేణులను ఢిల్లీ పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించారు. మంచి నీరు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే.. మరోవైపు ఫిరంగుల ద్వారా నీటిని ఆందోళనకారులపై ప్రయోగించడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతుంది.

Also Read: Video Viral: బిహార్‌లో కూలిన మరో వంతెన.. వారంలో రెండో ఘటన


మరోవైపు తీవ్ర నీటి కొరత నేపథ్యంలో ఢిల్లీ నీటి శాఖ మంత్రి అతిశీ దక్షిణ ఢిల్లీలోని బోగల్ వద్ద చేపట్టిన ఆమరణ నిరాహరా దీక్ష శనివారం రెండో రోజుకు చేరింది. ఆ క్రమంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె ఆరోపణలు గుప్పించారు. డిల్లీకి నీరు సరఫరా కాకుండా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. హర్యానా నుంచి ఢిల్లీకి ప్రతీ రోజు 110 గ్యాలన్ల నీరు సరఫరా చేయాల్సి ఉందని.. కానీ అంతకంటే తక్కువ నీరు ఈ రోజు కూడా విడుదల చేశారని మంత్రి అతిశి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఢిల్లీలో 28 లక్షల మంది ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారని మంత్రి అతిశీ ఆవేదన వ్యక్తం చేశారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jun 22 , 2024 | 05:13 PM