Home » New Delhi
కేంద్ర హోం మంత్రి కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్షా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాగిన మత్తులో ఉన్న ఒక ఇండియన్ పాసింజర్ తన తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బిజినెస్ క్లాస్లో ఈ ఘటన జరిగినట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.
తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రొఫెసర్ సూరజ్ మండల్ డిమాండ్ చేశారు. బీసీ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని సూచించారు
China-Bangladesh: చైనా పర్యటన సందర్భంగా బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఇండియాతో శత్రుత్వం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతం ఇచ్చాడు. భారతదేశానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
దేశంలో పెరుగుతున్న డిజిటల్ వేదికలు, ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా యాప్ల నియంత్రణ కోసం మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ కొత్త కౌన్సిల్ ముద్రణ, డిజిటల్, ప్రసార మాధ్యమాలను ఒకే గొడుగు కింద తీసుకొచ్చే ప్రతిపాదనను సమర్థించింది
ర్యాపిడో పింక్ మొబిలిటీ పథకం ద్వారా 2 లక్షల మహిళలకు ఉపాధి కల్పించేందుకు సిద్ధమైంది. ఈ పథకం ప్రస్తుతం మూడు నగరాల్లో 700 మందికి పైగా మహిళలకు ఉద్యోగాలు అందిస్తోంది
భారత రాజ్యాంగంలోని 222వ నిబంధనలోని క్లాజ్ వన్ ద్వారా రాష్ట్రపతి తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలాహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలనే సిఫారసు ఆమోదించారని ఆ ఉత్తర్వు తెలిపింది
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వ్యవహారంపై ధన్ఖడ్ మాట్లాడుతూ, ఇది కచ్చితంగా చాలా తీవ్రమైన అంశమని అన్నారు. దీనిపై కార్యచరణకు సంబంధించి ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేయమని ఖర్గే సూచించగా, జేపీ నడ్డా అంగీకరించినట్టు తెలిపారు.
పార్టీల సిద్ధాంతాలు, విధానాల విషయంలో 'ఇండియా' కూటమి భాగస్వామ పార్టీల మధ్య సల్ప తేడాలు ఉండవచ్చనీ, కానీ దేశ విద్యా వ్యవస్థ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని రాహుల్ గాంధీ అన్నారు.
అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు చాలా కీలకమని, అయితే ఇందువల్ల ఒనగూరే ప్రయోజనాలను చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలని ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ అన్నారు.