Share News

Delhi Police: బాలిక కిడ్నాప్ కేసు.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

ABN , Publish Date - May 10 , 2024 | 05:02 PM

8 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ ఘటనలో ఆ పాపను కాపాడమే కాకుండా కిడ్నాపర్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ దక్షిణ డీసీపీ అంకిత్ చౌహాన్ వివరాలు వెల్లడించారు.

Delhi Police: బాలిక కిడ్నాప్ కేసు.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

న్యూఢిల్లీ, మే 10: 8 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ ఘటనలో ఆ పాపను కాపాడమే కాకుండా కిడ్నాపర్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ దక్షిణ డీసీపీ అంకిత్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. మే 6 తేదీ మధ్యాహ్నం 3.00 గంటలకు 8 ఏళ్ల చిన్నారి కిడ్నాప్‌ అయినట్లు కోట్ల ముబారక్ పోలీస్‌స్టేషన్‌లో ఆ పాప కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో... కేసు నమోదు చేశారన్నారు.

LokSabha Elections: నామినేషన్ గడువు కొన్ని నిమిషాలే ఉంది.. శశాంక్ ఏం చేశాడంటే..

ఆ వెంటనే ఆ పాప కిడ్నాప్‌ అయిన ప్రాంతానికి పోలీసులు వెళ్లారని చెప్పారు. ఆ క్రమంలో పాప కుటుంబ సభ్యులతో పాటు బంధువులను సైతం పోలీసులు ప్రశ్నించారన్నారు. ఆ క్రమంలో పోలీసు బృందాలు ఆ పాప ఆచూకీ కోసం అన్వేషణ ప్రారంభించాయని వివరించారు. ఆ క్రమంలో అనుమానితులను సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు పేర్కొన్నారు.


అలాగే పాప కిడ్నాప్‌ అయిన ప్రాంతాలోని సీసీ ఫుటేజ్‌లను సైతం పరిశీలించగా.. డీటీసీ బస్‌స్టాప్ వద్ద పాపను కిడ్నాప్ చేసిన వ్యక్తిని గుర్తించామని వివరించారు. అందేరియా మురికివాడలోని ఉమర్‌లో పాపతోపాటు నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు తెలిపారు. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి ఆ పాపను రక్షించి.. నిందితుడి అరెస్ట్ చేశామన్నారు. నిందితుడి పేరు మహ్మద్ ఉమన్ అని చెప్పారు.

AP Elections: రోజా నిజస్వరూపం పోసాని లీలలు బయటపెట్టిన కిరాక్ ఆర్పీ ..!

అయితే నిందితుడు ఆ పాప ఇంటి సమీపంలోనే నివసిస్తుంటాడని పోలీసులు తెలిపారు. ఆట బొమ్మలు చూపించి.. ఆ పాపను కిడ్నాప్ చేసినట్లు తమ విచారణలో కిడ్నాపర్ వెల్లడించాడని డీసీపీ అంకిత్ చౌహాన్ వివరించారు.

Read Latest National News And Telugu News

Updated Date - May 10 , 2024 | 05:02 PM