Share News

Akhilesh Yadav: ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించండి: అఖిలేష్

ABN , Publish Date - Dec 14 , 2024 | 06:37 PM

'వన్ నేషన్-వన్ ఎలక్షన్' బిల్లు ఈనెల 16న లోక్‌సభ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి ఎన్నికల బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు

Akhilesh Yadav: ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించండి: అఖిలేష్

న్యూఢిల్లీ: ''వన్ నేషన్, వన్ ఎలక్షన్'' (One Nation, One Election) బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదించాలని ప్రభుత్వం తొందరపడుతుండటాన్ని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadva) నిలదీశారు. ఇంత అత్యవసరంగా జమిలి బిల్లును ఆమోదించాల్సి అవసరం ఏముందని ప్రశ్నించారు. మరీ అంత తొందర అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావిస్తే ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేసి దేశవ్యాప్తంగా మరోసారి ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.

Rahul Gandhi: సావర్కర్‌ను అవహేళన చేస్తున్నది మీరు కాదా?: రాజ్యాంగంపై చర్చలో రాహుల్


''ప్రధానమంత్రికి మరీ అంత తొందర అనిపిస్తే ఈరోజే దేశంలోని ప్రభుత్వాలన్నింటిని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలి'' అని అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. భారత రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడనున్న నేపథ్యంలో అఖిలేష్ తాజా వ్యాఖ్యలు చేశారు.


'వన్ నేషన్-వన్ ఎలక్షన్' బిల్లు ఈనెల 16న లోక్‌సభ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి ఎన్నికల బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బిల్లుపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నారు. ఈ విధానం ఆచరణ సాంధ్యం కాదని కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కొట్టివేశారు. ఏదైనా రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడి ఆరునెలల తర్వాత కారణాంతరాల వల్ల మెజారిటీ కోల్పోతే ఆ తర్వాత నాలుగున్నరేళ్ల పాటు రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రతిపాదిత బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని మరో కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ డిమాండ్ చేశారు. ఈ బిల్లు సమాఖ్య, ప్రజాస్వామిక సిద్ధాంతాలను బలహీనపరుస్తుందన్నారు.


ఇవి కూడా చదవండి..

Tamilnadu: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఇళంగోవన్ కన్నుమూత

Red Fort: ఎర్రకోట మాది.. తిరిగిచ్చేయండి..

జస్టిస్‌ శేఖర్‌ యాదవ్‌పై అభిశంసన నోటీసు

For National News And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 06:40 PM