Karnataka: సిద్దరామయ్య పేరులో రాముడు, నా పేరులో శివుడు.. డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 21 , 2024 | 01:50 PM
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ రోజున కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) సమర్థించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "మా భక్తి.. మా గౌరవం, మా మతం.. మేం వాటిని ప్రచారం చేయము.
బెంగళూరు: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ రోజున కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) సమర్థించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "మా భక్తి.. మా గౌరవం, మా మతం.. మేం వాటిని ప్రచారం చేయము. అలా చేయాలని కూడా ఎవరూ చెప్పలేదు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మంత్రులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సీఎం సిద్ధరామయ్య పేరులో రాముడున్నాడు. నా పేరులో శివుడున్నాడు. భక్తి గురించి
ఎవరూ మాకు నేర్పించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తరఫున మా కర్తవ్యం మేం చేస్తాం" అని అన్నారు. జనవరి 22న కర్ణాటక సర్కార్ హాలిడే మంజూరు చేయకపోవడంపై బీజేపీ విమర్శిస్తూ వస్తోంది. ఈ క్రమంలో డీకే శివకుమార్ ఆ పార్టీ నేతలకు కౌంటరిచ్చారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆరోజు సెలవు ప్రకటించాయి.