License to Drive: ట్రాక్టర్ నడపడానికి లైసెన్స్ అవసరమా..?
ABN , Publish Date - Dec 29 , 2024 | 05:49 PM
License to Drive: రహదారిపై ద్విచక్రవాహనాలు, కార్లు, బస్సులు నడుపుతారు. వాటిని అలా నడపాలంటే.. లైసెన్స్ కచ్చితంగా ఉండాల్సిందే. మరి కూలీలు తరలించడానికి, వ్యవసాయ పనులకు ట్రాక్టర్లను విరివిగా వినియోగిస్తారు. మరి ట్రాక్టర్లు నడపాలంటే.. లైసెన్స్ ఉండాలా? లేకపోయినా ఫర్వాలేదా ?
భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశ జనాభాలో 80 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటారన్న సంగతి అందరికి తెలిసిందే. ఆ క్రమంలో వ్యవసాయం చేయడానికి అనేక పనిముట్లు అవసరమవుతాయి. వాటిలో ట్రాక్టర్ కూడా ఒకటి. ట్రాక్టర్ వచ్చిన తర్వాత.. పొలంలో దుక్కి దున్నడం చాలా సులువైన పనిగా మారింది. ఇంకా చెప్పాలంటే.. కొన్ని నిమిషాల్లోనే పొలంలో దుక్కి దున్న వచ్చు. అలాగే అనేక వ్యవసాయ పనులను సైతం చేయవచ్చు.
మరి రహదారిపై ట్రాక్టర్ నడపాలంటే.. లైసెన్స్ కచ్చితంగా ఉండాల్సిందేనా? లేక పోయినా ఫర్వాలేదా ? అంటే.. ద్విచక్ర వాహనాలు, కార్లు నడపడానికి లైసెన్స్ ఉన్నట్లే.. ట్రాక్టర్ నడపడానికి సైతం లైసెన్స్ ఉండాలనే చెబుతున్నారు. రోడ్డుపై ట్రాక్టర్‌ను నడపాలంటే, తప్పనిసరిగా LMV ఉండాల్సిందే. అంటే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సి ఉంది. ఈ లైసెన్స్ ఉంటే.. ఎవరైనా ట్రాక్టర్ నడపవచ్చని చెబుతున్నారు.
లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్ :
లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే.. ఎటువంటి పరిమితులు లేకుండా దేశంలోని రహదారులపై ఎలాంటి లైట్ మోటారు వాహనాన్ని అయినా నడపవచ్చు. ఏదైనా ఇతర డ్రైవింగ్ లైసెన్స్ లాగానే, ఈ లైసెన్స్ పొందడానికి కనీసం 18 ఏళ్లు వయస్సు నిండి ఉండాల్సి ఉంది.
కోర్టు కీలక తీర్పు:
ఈ వ్యవహారంపై ఇటీవల కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించింది. లైట్ మోటారు వాహనాలను నడపడానికి లైసెన్స్ ఉన్న వ్యక్తికి ట్రాక్టర్‌ను నడపడానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది. అయితే దాని బరువు 7500 కిలోలకు మించకూడదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఓ వేళ.. ట్రాక్టర్ డ్రైవర్ ప్రమాదానికి గురి అయితే క్లెయిమ్ దారులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత మాత్రం బీమా కంపెనీదేనని స్పష్టం చేసింది. బీమా కంపెనీ అప్పీల్‌ను తిరస్కరిస్తూ నటరాజన్ ధర్మాసనం ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 75 మంది ఉగ్రవాదులు హతం
Also Read: పోలీస్ శాఖలో మరణ మృదంగం.. ఈ ప్రభుత్వానికి పట్టదా?
Also Read: వారికి విజయవాడ నగర సీపీ వార్నింగ్
For National News And Telugu News