రూ.200 కోట్లు దానం చేసి.. ఆధ్యాత్మిక మార్గంలోకి
ABN , Publish Date - Apr 16 , 2024 | 03:34 AM
గుజరాత్‌లోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన దంపతులు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాలని నిర్ణయించుకుని, దాదాపు రూ.200 కోట్ల తమ సంపదను దానం చేశారు. హిమ్మత్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త భవేశ్
22న గుజరాత్ దంపతుల జైన సన్యాసం
రూ.200 కోట్ల సంపదను దానం చేసి..
సూరత్, ఏప్రిల్ 15: గుజరాత్‌లోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన దంపతులు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాలని నిర్ణయించుకుని, దాదాపు రూ.200 కోట్ల తమ సంపదను దానం చేశారు. హిమ్మత్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త భవేశ్ భండారి దంపతులకు ఓ కూతురు(19), ఓ కుమారుడు(16) ఉండగా.. 2022లోనే వారు జైన సన్యాసం తీసుకున్నారు. బంధాలను, సకల సౌకర్యాలను త్యజించి సన్యాసులుగా జీవిస్తున్నారు. వారి నుంచి ప్రేరణ పొందిన తల్లిదండ్రులు కూడా అదే మార్గంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గత ఫిబ్రవరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తమ సంపదను మొత్తం దానం చేశారు. ఈ నెల 22న భండారి దంపతులు జైన సన్యాసం స్వీకరించనున్నారు. అప్పటి నుంచి వారు కేవలం రెండు తెల్లటి వస్త్రాలు, ఓ రజోహరన్(చీపురులాంటిది), భిక్షం ఎత్తుకునేందుకు ఓ పాత్రను మాత్రమే కలిగి ఉంటారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా దేశ పర్యటన చేస్తూ, భిక్షను స్వీకరిస్తూ జీవిస్తారు.