Share News

Ayushman Bharat : ఆయుష్మాన్‌ భారత్‌ కవరేజీ రెట్టింపు?

ABN , Publish Date - Jan 18 , 2024 | 03:04 AM

ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుపై కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా 10 లక్షల రూపాయల వ్యయం వరకు వైద్యం పొందే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుపై కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య

 Ayushman Bharat : ఆయుష్మాన్‌ భారత్‌ కవరేజీ రెట్టింపు?

రూ.10 లక్షలకు పెంచే యోచన

1న బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం

న్యూఢిల్లీ, జనవరి 17: ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుపై కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా 10 లక్షల రూపాయల వ్యయం వరకు వైద్యం పొందే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుపై కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్నారు. కేన్సర్‌ చికిత్స, అవయవ మార్పిడి తదితరాలకు మరింత వ్యయం అవుతున్న దృష్ట్యా 2024-25 సంవత్సరం నుంచి ఈ కార్డుపై ఆరోగ్య బీమా కవరేజీని రెట్టింపు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌లో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి.

Updated Date - Jan 18 , 2024 | 03:04 AM