Share News

సుప్రియ, దిలీప్‌ ఘోష్‌కు ఈసీ నోటీసులు

ABN , Publish Date - Mar 28 , 2024 | 03:40 AM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది.

సుప్రియ, దిలీప్‌ ఘోష్‌కు ఈసీ నోటీసులు

న్యూఢిల్లీ, మార్చి 27: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. నటి కంగనా రనౌత్‌ను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనతే, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత దిలీప్‌ ఘోష్‌కు బుధవారం ఈసీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. వివరణ ఇవ్వని పక్షంలో తప్పుగా చేసినట్లుగా పరిగణించి ఎన్నికల నియామవళి ప్రకారం చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. అయితే, కంగన గురించి తాను పోస్ట్‌ చేయలేదని సుప్రియ ఇప్పటికే ప్రకటించగా, దిలీప్‌ ఘోష్‌ తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు.

Updated Date - Mar 28 , 2024 | 07:31 AM