Kolkata: టిష్యూ పేపర్‌పై బిజినెస్ ఐడియా రాసి కేంద్ర మంత్రికి ఇచ్చి..
ABN , Publish Date - Feb 09 , 2024 | 12:50 PM
ఒక్క బిజినెస్ ఐడియా ఆ వ్యాపారికి తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. ఏకంగా కేంద్ర మంత్రి స్పందించి.. ఐడియాకు మద్దతుగా చర్యలు చేపట్టడం బిజినెస్ మ్యాన్‌కు సంతోషం కలిగించింది.
కోల్‌కతా: ఒక్క బిజినెస్ ఐడియా ఆ వ్యాపారికి తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. ఏకంగా కేంద్ర మంత్రి స్పందించి.. ఐడియాకు మద్దతుగా చర్యలు చేపట్టడం బిజినెస్ మ్యాన్‌కు సంతోషం కలిగించింది. పశ్చిమబెంగాల్(West Bengal) రాజధాని కోల్‌కతాకు చెందిన యువ వ్యాపారవేత్త అక్షయ్ ఘన వ్యార్థాల నిర్వహణ కంపెనీ ఎండీగా ఉన్నారు.
ఫిబ్రవరి 2న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) ప్రయాణిస్తున్న కోల్‌కతా విమానంలో అక్షయ్ కూడా ఉన్నారు. మంత్రిని చూసి ఆయన తన బిజినెస్ ఐడియా చెప్పడానికి ముందుకొచ్చారు. "మీరు అనుమతిస్తే.. ఘన వ్యర్థాలు ఉపయోగించుకునే పరిశ్రమలకు రైళ్ల ద్వారా వాటిని ఎలా చేరవేయవచ్చో ఐడియా చెబుతాను" అని అన్నారు.
తమ కంపెనీ 2022లో 3 వేల 500 టన్నుల ఘన వ్యర్థాలను చిత్‌పుర్ నుంచి రాజ్ గంగ్‌పుర్‌లోని సిమెంటు పరిశ్రమకు రైళ్లో తరలించామని.. ఈ ఐడియాను దేశ వ్యాప్తంగా అమలు చేస్తే చాలా ప్రయోజనాలుంటాయని మంత్రితో అన్నారు. ప్రపోజల్ ఇవ్వాలని మంత్రి కోరగా.. సమయానికి పేపర్ అందుబాటులో లేకపోవడంతో టిష్యూ పేపర్‌పై తన ఐడియాను రాసిచ్చారు. దాన్ని తీసుకుని మంత్రి కోల్‌కతాలో దిగిపోయారు.
విమానం ఆగిన 6 నిమిషాలకే రైల్వే జీఎం ఆఫీసు నుంచి ఫోన్ రావడంతో అక్షయ్ షాక్‌కి గురయ్యారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 6న రైల్వే జీఎం మిలింద్ దేవుస్కర్‌తో అక్షయ్ సమావేశమయ్యారు. అధికారుల ముందు తన ఐడియాను వివరించారు. తన ఐడియాతో స్వచ్ఛభారత్ ఆకాంక్ష పరిపూర్ణం అవుతుందని పేర్కొన్నారు. మంత్రి స్పందించడం.. అధికారులు తనతో సమావేశం ఏర్పాటు చేయడంపై అక్షయ్ హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి